Glenn Maxwell: ఆర్‌సీబీ విలన్‌గా మారిన మ్యాక్స్‌వెల్.. వరల్డ్ కప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా..!

Glenn Maxwell in IPL 2024: ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఆటతీరు మరింత దారుణంగా తయారైంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓటములతో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇక నుంచి ఆర్‌సీబీకి ప్రతి మ్యాచ్‌ కీలకంగా మారనుంది. స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ఫామ్‌ బెంగళూరు ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 12, 2024, 05:11 PM IST
Glenn Maxwell: ఆర్‌సీబీ విలన్‌గా మారిన మ్యాక్స్‌వెల్.. వరల్డ్ కప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా..!

Glenn Maxwell in IPL 2024: డబ్ల్యూపీఎల్‌లో ఆర్‌సీబీ ఉమెన్స్ టీమ్ కప్‌ కొట్టడంతో ఈసారి ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కూడా తప్పకుండా టైటిల్ విన్నర్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రదర్శన ఈ సీజన్‌లో మరింత దారుణంగా తయారైంది. బ్యాటింగ్‌లో భారీ స్కోర్లు చేస్తున్నా.. బౌలింగ్‌లో బలహీనంగా ఉండడంతో ఆర్‌సీబీ మ్యాచ్‌లను అలవోకగా ప్రత్యర్థులకు అప్పగించేస్తోంది. ఈ సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడిపోయింది. గురువారం ముంబై ఇండియన్స్‌పై 196 పరుగుల భారీ స్కోరు చేసినా.. ముంబై కేవలం 15.3 ఫోర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాట్స్‌మెన్ చెలరేగిపోతుంటే.. ఆర్‌సీబీ బౌలర్లు చూస్తు ఉండిపోయారు. ఏ బౌలర్‌ను వదలకుండా ముంబై బ్యాట్స్‌మెన్ చితక్కొట్టారు. స్టార్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, టోప్లీ జట్టులో ఉన్నా.. ఫామ్‌లో లేకపోవడం ఆర్‌సీబీకి పెద్ద మైనస్‌గా మారింది.

Also Read: Rameshwaram Cafe: కీలక మలుపు.. రామేశ్వరం కేఫ్‌లో బాంబు పెట్టినోడు, ప్లాన్‌ వేసినోడు ఇద్దరూ అరెస్ట్‌

స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆటతీరు కూడా ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. వన్డే వరల్డ్ కప్‌, భారత్‌తో టీ20 సిరీస్‌ వరకు అద్భుత ఆటతీరును కనబర్చిన మ్యాక్సీ.. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో మాత్రం తేలిపోతున్నాడు. వరల్డ్ కప్‌లో అఫ్ఘానిస్థాన్‌పై మ్యాక్స్‌వెల్ ఒంటి చెత్తో జట్టును గెలిపించిన ఇన్నింగ్స్‌ను క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మార్చిపోరు. అయితే ఈ సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. 6మ్యాచ్‌ల్లో వరుసగా 0, 3, 28, 0, 1, 0 పరుగులు చేశాడు. మూడుసార్లు డకౌట్ అయ్యాడు. ముంబైతో మ్యాచ్‌లోనూ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లో వచ్చిన మ్యాక్స్‌వెల్.. డకౌట్ అయి తీవ్రంగా నిరాశ పరిచాడు. ఫీల్డింగ్‌లోనూ మ్యాక్సీ తన ప్రభావం చూపించలేకపోతున్నాడు. ముంబై మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు విడిచి విలన్‌గా మారిపోయాడు. బౌలింగ్‌లో ఒక ఓవర్ వేసి 17 పరుగులు సమర్పించుకున్నాడు. 

ఆసీస్‌ తరుఫున 106 టీ20 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్.. 155.51 స్ట్రైక్ రేట్, 30.09 సగటుతో 2468 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. అయితే ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్ సగటు భిన్నంగా ఉంది. 25.24కి తగ్గింది. ప్రస్తుతం ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడిపోయింది. ఒకే ఒక్క గెలుపుతో పాయింట్ల పట్టికలో కింద నుంచి రెండోస్థానంలో ఉంది. ఇంకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. వీటిలో కనీసం 7 మ్యాచ్‌లు నెగ్గితేనే ప్లే ఆఫ్‌లో చేరే అవకాశం ఉంటుంది. మ్యాక్స్‌వెల్ రాణించడంతోపాటు బౌలింగ్ విభాగం మెరుగుపడితేనే ఆర్‌సీబీ టోర్నీలో పుంజుకుంటుంది. లేదంట్ ఈసాలా కప్‌ నమ్దే అంటూ వచ్చే ఏడాది కోసం ఎదురుచూడాల్సిందే..!

Also Read: Tatikonda Rajaiah: వరంగల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News