మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి రిటైర్ కావడం (MS Dhoni Retirement)పై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) స్పందించాడు. అయితే బాగా ఆడావు ధోనీ అంటూనే గంభీర్ మెలికలు పెట్టాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగానే ఈ మేరకు గంభీర్ ఓ ట్వీట్ (Gambhir Comments On Dhoni Retirement) చేశాడు. ‘భారత్ ఏ నుంచి టీమిండియా వరకు మన ప్రయాణంలో ఎన్నో ప్రశ్నార్థకాలు, కామాలు, ఖాళీలు, ఆశ్చర్యార్థకాలున్నాయి. Dhoni Retirement: ఎంఎస్ ధోనీ కెరీర్ ఎలా మొదలైందో అలాగే ముగిసింది
ఇప్పుడు నీ అధ్యాయానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేశావు. అనుభవంతో చెబుతున్నాను.. నీ జీవితంలో ఈ కొత్త దశ చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఇక్కడ డీఆర్ఎస్ లిమిట్స్ లేవు. బాగా ఆడావు ధోనీ’ అని బీసీసీఐతో పాటు ధోనీని ట్యాగ్ చేస్తూ మహీ రిటైర్మెంట్‌పై తన అభిప్రాయాన్ని గంభీర్ వెల్లడించాడు. Sourav Ganguly: ధోనీ రిటైర్మెంట్ గురించి దాదా ఏమన్నాడంటే..
‘గంగూలీ పునాదితోనే MS Dhoniకి విజయాలు’
From “India A” to “The India” our journey has been full of question marks, commas, blanks & exclamations. Now as you put a full stop to your chapter, I can tell u from experience that the new phase is as exciting and there’s no limit to DRS here!!! Well played @msdhoni @BCCI
— Gautam Gambhir (@GautamGambhir) August 15, 2020
కాగా, అవకాశం చిక్కినప్పుడల్లా మాజీ కెప్టెన్ ధోనీపై మాజీ ఓపెనర్ గంభీర్ విమర్శలు గుప్పించేవాడు. ధోనీ గొప్ప కెప్టెన్ అని అందరూ చెబుతారని.. యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్బజన్ సింగ్ లాంటి టాలెంటెడ్ క్రికెటర్లను ప్రోత్సహించి టీమిండియాకు అందించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే గొప్ప కెప్టెన్ అని గంభీర్ ఇటీవల ప్రస్తావించాడు. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ధోనీ కేవలం ఒకరిద్దరు మ్యాచ్ విన్నర్లను మాత్రమే అందించగలిగాడని గంభీర్ విమర్శించడం తెలిసిందే. అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos
Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..