England Cricketers Tested Positive for COVID-19: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా మహమ్మారి కలకలం రేపింది. శ్రీలంక జట్టులో సిబ్బంది, ఆటగాళ్లు మొత్తం 7 మంది కరోనా బారిన పడ్డారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన 3వ వన్డే అనంతరం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సహాయక సిబ్బందికి కోవిడ్19 పాజిటివ్‌గా గుర్తించారు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టు, సహాయక సిబ్బంది ఐసోలేషన్‌లో ఉన్నారని బోర్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కరోనా బారిన పడిన ఆటగాళ్లు, సిబ్బంది వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఆదివారం శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో వన్డే జరిగింది. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లకు నిర్వహించిన కరోనా పరీక్షలలో ఏడుగురికి కోవిడ్19 పాజిటివ్ (England Cricketers Tests Positive for COVID-19)గా తేలగా, ఆటగాళ్లను, సిబ్బందిని ఐసోలేషన్‌లో ఉంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు బుధవారం నుంచి పాకిస్థాన్‌తో ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని ఈసీబీ స్పష్టం చేసింది. పాక్‌తో సిరీస్ అనంతరం ఇంగ్లాండ్ జట్టు ఆగస్టులో టీమిండియా (India vs England 2021)తో టెస్టు సిరీస్ ఆడనుంది.
గత ఏడాది నుంచి ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఎక్కువగా బయో బబుల్ లాంటి కఠిన వాతావరణంలో గడిపారని, గత కొన్ని రోజులుగా బయో బబుల్‌కు కాస్త దూరంగా ఉండటంతో కరోనా బారిన పడ్డారని బోర్డు అభిప్రాయపడింది. బెన్‌స్టోక్స్ కెప్టెన్సీలో కొత్త జట్టును ఎంపిక చేసి పరిమిత ఓవర్ల సిరీస్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఇంగ్లాండ్ బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్19 (India COVID-19 Cases) నిబంధనల్ని పాటిస్తూ, బయో బబుల్ వాతావరణంలో ఆటగాళ్లు ఉండేలా చర్యలు తీసుకునేందుకు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
Also Read: Anil Kumble: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన క్రికెటర్ అనిల్ కుంబ్లే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
COVID-19: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం, మొత్తం 7 మందికి కరోనా పాజిటివ్
ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టులో కరోనా పాజిటివ్ కేసులు
శ్రీలంకతో జరిగిన 3వ వన్డే అనంతరం కరోనా నిర్ధారణ పరీక్షలు
ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సహాయక సిబ్బందికి కోవిడ్19 పాజిటివ్