Chennai Superkings: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరిన ఇంగ్లండ్ ఆటగాడు మొయిన్ అలీ

Chennai Superkings: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్టార్ ప్లేయర్ గూటికి చేరాడు. వీసా నిబంధనల్లో సాంకేతిక సమస్యల కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన మొయిన్ అలీ..ఇక అందుబాటులో ఉండనున్నాడు  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 28, 2022, 05:29 PM IST
Chennai Superkings: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరిన ఇంగ్లండ్ ఆటగాడు మొయిన్ అలీ

Chennai Superkings: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్టార్ ప్లేయర్ గూటికి చేరాడు. వీసా నిబంధనల్లో సాంకేతిక సమస్యల కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన మొయిన్ అలీ..ఇక అందుబాటులో ఉండనున్నాడు

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్, చెన్నై సూపర్‌కింగ్స్ కీలక ఆటగాడు మొయిన్ అలీ ఇండియాకు చేరుకోవడంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇక బాదుడే బాదుడంటున్నారు సీఎస్కే ఫ్యాన్స్. 2021 టైటిల్ చెన్నై సూపర్‌కింగ్స్ గెల్చుకోవడంలో మొయిన్ అలీదే కీలక పాత్ర. అందుకే..వేలానికి ముందే కెప్టెన్ మహేంద్ర‌సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్‌లతో పాటు మొయిన్ అలీని సీఎస్కే రిటైన్ చేసుకుంది. మొయిన్ అలీ చెన్నై తరుపున 15 మ్యాచ్‌లలో 357 పరుగులు చేయడమే కాకుండా 6 వికెట్లు తీసుకున్నాడు.

వాస్తవానికి మొన్న గురువారమే అతను ఇండియాకు చేరుకున్నా..కరోనా నిబంధనల ప్రకారం మూడ్రోజులపాటు నిర్బంధంలో ఉండాల్సి వచ్చింది. ఇవాళ్టితో క్వారెంటైన్ పూర్తి కావడంతో..వెంటనే జట్టులోని ఇతర ఆటగాళ్లను కలుసుకున్నాడు. జట్టులోని ఆటగాళ్లను, సిబ్బందిని ఒక్కొక్కరిగా షేక్ హ్యాండ్ ఇస్తూ..కౌగిలించుకోవడం స్పష్టంగా కన్పిస్తుంది. మొయిన్ అలీ రాకతో ఇతర ఆటగాళ్లు సంతోషంగా కన్పిస్తారు. ఈ వీడియోను సీఎస్కే యాజమాన్యం షేర్ చేసింది. 

Also read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కి భారీ షాక్.. మరో స్టార్ ప్లేయర్ ఔట్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News