Harry Brook: క్రికెట్. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఆట. ప్రత్యర్ధి బౌలర్లపై ఓ బ్యాట్స్‌మెన్ విరుచుకు పడుతుంటే ఆ గేమ్ మజానే వేరు. అదే జరిగింది అక్కడ. ఏకంగా విధ్వంసమే సృష్టించాడతడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ప్రపంచమంతా ప్రాచుర్యం పొందిన టీ20 టోర్నమెంట్. అదే తరహాలో ఇతర దేశాల్లో కూడా జరుగుతున్నాయి. ఇదంతా ఐపీఎల్ స్ఫూర్తితోనే. ప్రస్తుతం మన ప్రత్యర్ధి దేశం పాకిస్తాన్లో పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతోంది. లాహోర్ క్యాలెండర్స్ వర్సెస్ ఇస్లామాబాద్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో పెను విధ్వంసమే చోటుచేసుకుంది. ఆ విధ్వంసమేంటంటే..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ క్యాలెండర్స్ జట్టు 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. నాలుగవ వికెట్‌కు ఫఖర్ జమాన్, ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్యూక్ కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ కలిసి ఏకంగా వంద పరుగులు జోడించారు. ఈ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్..ఇస్లామాబాద్ బౌలర్లపై తుపానులా విరుచుకుపడ్డాడు. కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అంతేకాదు...ఈ సెంచరీలో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. వచ్చిన బంతిని వచ్చినట్టుగా పెవిలియన్‌కు తరలించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టున్నాడు. ప్రతి ఓవర్లో ఫోర్ లేదా సిక్సర్ కచ్చితంగా ఉండేట్టు చూసుకున్నాడు. బౌలర్‌కు ఆప్షన్ లేకుండా చేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో లాహోర్ క్యాలెండర్ల్ జట్టు 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది. ఇక విధ్వంసం సృష్టించిన హ్యారీ బ్రూక్..49 బంతుల్లో 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అటు ఫఖర్ జమాన్...51 పరుగులు సాధించి జహీర్ ఖాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
ఇక 198 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ 9 వికెట్లు కోల్పోయి..కేవలం 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. 66 పరుగుల తేడాతో లాహోర్ క్యాలెండర్స్ ఘన విజయం సాధించింది. లాహోర్ బౌలర్లలో షాహీన్ షా ఆఫ్రిది, రషీద్ ఖాన్, హరీష్ రఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, ఇస్లామాబాద్ యునైటెడ్ బౌలర్లలో ఫాహిమ్ అష్రఫ్ మూడు వికెట్లు తీసుకున్నాడు.
Also read: Wriddhiman Saha: 'అతడు నన్ను రిటైరవమన్నాడు'.. ద్రవిడ్, దాదాలపై సాహా షాకింగ్ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి