Mayank Agarwal to join India Squad: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2021లో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్‌లోని చివరి మ్యాచ్ తాత్కాలికంగా రద్దయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ అనంతరం షెడ్యూల్ అయింది. 2022 జులై 1 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా ఐదవ టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్టు సిరీస్‌లో భారత్.. 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్ట్ భారత్ గెలిచినా లేదా డ్రా చేసుకున్నా సిరీస్ సొంతమవుతుంది.
దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ ఆరంభానికి ఒక రోజు ముందు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే. ప్రాక్టీస్ చేస్తుండగా గాయం అవ్వడంతో దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ సహా ఇంగ్లండ్ ఏకైక టెస్టుకు అతడు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో స్టార్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌కు భారత జట్టులో చోటు దక్కనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అంతేకాకుండా దక్షిణాఫ్రికా పొట్టి సీరీసులో భారత జట్టును నడిపిస్తున్న రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.
బీసీసీఐ అధికారి ఒకరు ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ఇంగ్లండ్ పర్యటనకు మయాంక్ అగర్వాల్‌ను సిద్ధంగా ఉంచాం. రాహుల్‌కు ప్రత్యామ్నాయం కోసం జట్టు మేనేజ్‌మెంట్‌ను అడిగాం. ఈ నెల 19 లోగా మయాంక్ విషయంపై క్లారిటీ ఇస్తామని చెప్పారు. అవసరమైతే మయాంక్ రెండవ బ్యాచ్‌తో కలిసి ఇంగ్లండ్‌కు వెళ్లనున్నాడు' అని పేర్కొన్నాడు. గురువారం ముంబై నుంచి భారత ప్లేయర్లు కొందరు ఇంగ్లండ్ బయలుదేరారు. ఈ నెల 20న మిగతా భారత ప్లేయర్స్ వెళ్లనున్నారు.
5వ టెస్ట్‌కు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ఛెతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ కృష్ణ.
Also Read: Sunset Time: సూర్యాస్తమయం వేళ ఆ పనులు చేస్తే..లక్ష్మీదేవికి ఆగ్రహం
Also Read: Vastu Tips: ఇంట్లో ఆ విగ్రహాన్ని సరైన దిశలో ఉంచితే..అద్భుతం కన్పిస్తుంది
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook