ENG vs IND Playing XI: రోహిత్ ఇన్.. బుమ్రా ఔట్! తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే

ENG vs IND 1st T20, Rohit Sharma to lead India in 1st T20I vs England. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 6, 2022, 04:02 PM IST
  • సౌతాంప్టన్ వేదికగా తొలి టీ20
  • రోహిత్ ఇన్.. బుమ్రా ఔట్
  • తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే
ENG vs IND Playing XI: రోహిత్ ఇన్.. బుమ్రా ఔట్! తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే

ENG vs IND 1st T20 Playing 11: ఇంగ్లండ్‌పై ఐదో టెస్టులో ఓడిన భారత్ టీ20 సిరీస్‌కు సిద్దమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. హిట్టర్లు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌ 2022కు ఈ సిరీస్‌ను ఇరు జట్లు సన్నాహకంగా భావిస్తున్నాయి. మ్యాచ్ నేపథ్యంలో భారత్ తుది జట్టును ఓసారి పరిశీలిద్దాం. 

కరోనా కారణంగా ఐదో టెస్ట్ మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టీ20లో ఆడనున్నాడు. ఈ మ్యాచ్ కోసం రోహిత్ ఇప్పటికే ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. గాయం కారణంగా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ పర్యటనకు దూరమవడంతో.. యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌ బరిలోకి దిగనున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో 4 మ్యాచుల్లో 192 పరుగులు చేసిన ఇషాన్.. ఐర్లాండ్‌తోనూ రాణించాడు. మిడిలార్డర్‌లో సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా ఆడనున్నారు. సంజూ, హుడా ఇటీవల బాగా రాయించారు. ముఖ్యంగా హుడా సెంచరీతో సత్తా చాటాడు. 

ఐపీఎల్ 2022, ఐర్లాండ్‌పై కెప్టెన్‌గా రాణించిన హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా జట్టులో కొనసాగనున్నాడు. ఐపీఎల్ 2022లో హిట్టర్‌ అవతారమెత్తిన దినేశ్ కార్తీక్.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌పై సత్తా చాటాడు. ఇంగ్లండ్‌పై కూడా చెలరేగడానికి సిద్ధంగా ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్ పేస్ విభాగంలో యుజ్వేంద్ర చహల్ స్పిన్ విభాగంలో ఆడనున్నారు. ఇంగ్లండ్ పిచులు కాబట్టి ఒక స్పిన్నర్‌టోన్ భారత్ బరిలోకి దిగనుంది. ఉమ్రాన్ మాలిక్‌ బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. టెస్ట్ ఆడిన సీనియర్ ప్లేయర్స్ ఈ మ్యాచుకు దూరంగా ఉన్నారు. 

తుది జట్టు (అంచనా): 
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చహల్. 

Also Read: Goutham Raju: గౌతమ్ రాజు కుటుంబానికి చిరంజీవి ఆర్థిక సాయం.. అండగా ఉంటామని హామీ

Also Read: CM Bhagwant Mann: రెండో పెళ్లి చేసుకోబోతున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. రేపు చండీగఢ్‌లో వివాహం..   

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News