Dinesh Karthik: ఆ ఒక్క టోర్నీ నా జీవితాన్నే ఆగం చేసింది.. ఎంఎస్ ధోనీ మేనియా ముందు నిలవలేకపోయా: దినేశ్ కార్తిక్‌

Dinesh Karthik opens up on being MS Dhoni understudy. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్  ధోనీ ఆధిపత్యం ముందు తాను నిలవలేకపోయానని దినేష్ కార్తీక్ అంగీకరించాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Feb 28, 2023, 03:50 PM IST
  • ఆ ఒక్క టోర్నీ నా జీవితాన్నే ఆగం చేసింది
  • ఎంఎస్ ధోనీ మేనియా ముందు నిలవలేకపోయా
  • దినేశ్ కార్తిక్‌ ఆవేదన
Dinesh Karthik: ఆ ఒక్క టోర్నీ నా జీవితాన్నే ఆగం చేసింది.. ఎంఎస్ ధోనీ మేనియా ముందు నిలవలేకపోయా: దినేశ్ కార్తిక్‌

Dinesh Karthik says MS Dhoni took his opportunities: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీలో ప్రపంచ క్రికెట్‌లో తనడైన ముద్ర వేశాడు. మెరుపు వేగంతో కీపింగ్ చేసే ధోనీ.. భారత జట్టులో ఉండడంతో మరో వికెట్ కీపర్‌కు అవకాశం లేకుండా పోయింది. మహీ రాకతో పార్థివ్ పటేల్, దినేష్ కార్తీక్ కెరీర్ సాఫీగా సాగలేదు. పార్థివ్ కెరీర్ అప్పటికే ముగిసిపోగా.. ధోనీ రిటైర్మెంట్ అనంతరం డీకే అడపాదడపా అవకాశాలు అందుకున్నా పెద్దగా రాణించలేకపోయాడు. దాదాపుగా కార్తీక్ కెరీర్ కూడా క్లోజ్ అయినట్టే. ధోనీ ఆధిపత్యం ముందు తాను నిలవలేకపోయానని డీకే కూడా అంగీకరించాడు.

ఆర్‌సీబీ ప్యాడ్‌ కాస్ట్‌తో దినేష్ కార్తీక్ మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నాడు. 'ఎంఎస్ ధోనీ కంటే ముందే నేను జాతీయ జట్టులోకి వచ్చాను. భారత్ A తరఫున ఇద్దరం కలిసి ఆడాం. నేను అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చేటప్పటికి ధోనీ ఇంకా భారత్-Aతో ఆడుతున్నాడు. తొలిసారి మేమిద్దరం కలిసి నాలుగు రోజుల మ్యాచ్‌ ఆడాం. ఆ తర్వాత టీమిండియాకి పిలుపొచ్చింది. అక్కడ నుంచి వరుసగా మేం టోర్నీలకు వెళ్ళాం. అయితే ఒకే ఒక వన్డే టోర్నమెంట్‌ అభిమానులు ధోనీకి ఫిదా అయ్యేలా చేసింది. ఆ టోర్నీలో మహీ అదరగొట్టేశాడు. అభిమానుల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభించింది' అని డీకే అన్నాడు. 

'ఎంఎస్ ధోనీని ఫాన్స్ ప్రత్యేకమైన ఆటగాడిగా భావించారు. నేను అప్పటికే జాతీయ జట్టులో ఉన్నప్పటికీ.. ధోనీ మేనియా ముందు నిలవలేకపోయా. ఆ తర్వాత అన్ని ఫార్మాట్లలో మహీ ఆడాడు. అయితే అతడు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అవకాశాలను అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యం. అవకాశాలను దక్కించుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. నేను ఛేజింగ్‌లో బాగా ఆడాను. ప్రపంచ క్రికెటర్లలో ఉత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నా. అయితే మహీ వచ్చాక పరిస్థితి మారిపోయింది. అతడు ఇంకా అద్భుతంగా ఆడాడు. అన్ని ఫార్మాట్లలో జట్టులో సెటిల్‌ అయిపోయాడు' అని దినేష్ కార్తీక్ చెప్పాడు. 

'కెరీర్‌ ప్రారంభం నుంచి ఎంఎస్ ధోనీ పొరపాట్లు చేయలేదు. టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగకు పంపిస్తే వన్డేలో సెంచరీ చేశాడు. టెస్టులోనూ 85 పరుగులు బాదాడు. అద్భుతంగా ఆడటంతో ఒక్కసారిగా ఓ బ్రాండ్‌గా మారిపోయాడు. నేను మాత్రం వెనకపడిపోయా. నేర్చుకొనేవాడిగానే ఉండిపోయా. అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి ప్రయత్నించా' అని డీకే పేర్కొన్నాడు. 2004 డిసెంబర్‌లో ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చాడు. మహీ కంటే రెండు నెలల ముందే డీకే  జాతీయ జట్టులోకి వచ్చాడు. 

Also Read: NZ vs ENG: టెస్టు క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ మ్యాచ్.. ఒక్క పరుగు తేడాతో ఇంగ్లండ్ ఓటమి! మూడో జట్టుగా కివీస్‌ రికార్డు   

Also Read: Hair Care: ఈ నూనె వాడితే జుట్టు పిక్కున్న రాలదు, అంత స్ట్రాంగ్‌గా తయారవుతుంది!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

Trending News