Deepak Hooda In Match Fixing Scanner: ఐపీఎల్-2021(IPL 2021) రెండో అంచెలో భాగంగా..సెప్టెంబరు 21న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్(RAJASTHAN ROYALS) 2 పరగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సులువుగా గెలుస్తుందనుకున్న పంజాబ్..అనూహ్యంగా చివరి రెండు ఓవర్లలో తడబడటం పలు సందేహలకు తావిస్తుంది. అంతేకాదు..మ్యాచ్ కు కొన్ని గంటల ముందు పంజాబ్ ఆటగాడు దీపక్ హుడా(Deepak Hooda)తన ఇన్ స్టా ఖాతాలో చేసిన ఓ పోస్టు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
Here we go💪@PunjabKingsIPL #PBKSvRR #IPL2021 #SADDAPUNJAB pic.twitter.com/UfujNTU9QG
— Deepak Hooda (@HoodaOnFire) September 21, 2021
వివరాల్లోకి వెళితే..
మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో హూడా తన ఇన్‌స్టా(Instagram)లో ఓ పోస్ట్ చేశాడు. అందులో అతను పంజాబ్ కింగ్స్(Punjab Kings) తుది జట్టులో ఆడుతున్నట్లు స్పష్టం చేశాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏదైనా జట్టు తుది వివరాలు టాస్ వేసే సమయంలో కెప్టెన్ రిఫరీకి అందిస్తాడు. జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లైనా సరే తుది జట్టు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ టాస్(Toss)కు ముందు బహిర్గతం చేయకూడదు.
Also Read: IPL 2021: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షాక్..కెప్టెన్ సంజూ శాంసన్‌కు రూ.12 లక్షల జరిమానా
బీసీసీఐ సీరియస్
ఈ నేపథ్యంలో ఈ పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ తుది జట్టు వివరాలను బయటపెట్టడంపై బీసీసీఐ(BCCI) సీరియస్‌గా ఉంది. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా అనుమానాస్పద ప్రవర్తన కారణంగా అతన్ని యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) నిఘా పరిధిలోకి తీసుకువచ్చింది. జట్టు, పిచ్ సంబంధిత వివరాలను బహిర్గతం చేయడం బీసీసీఐ నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, అన్నీ తెలిసి కూడా దీపక్ హూడా తుది జట్టు వివరాలను సోషల్ మీడియాలో వెల్లడించడం నేరమని ఏసీయూ(ACU) పేర్కొంది.
పలు కోణాల్లో దర్యాప్తు..
రంజీ జట్టు కెప్టెన్‌గా, గతంలో పలు ఐపీఎల్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా ఎంతో అనుభవమున్న హూడా ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచిందని, ఈ పోస్ట్‌ను అతను అనుకోకుండా పెట్టాడా లేదా బుకీలకు ఏదైనా హింట్ ఇద్దామని చేశాడా అన్న కోణంలో ఆరా తీస్తున్నామని ఏసీయూ పేర్కొంది. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఆఖరి ఓవర్(Last over)లో 4 పరుగులు చేయాల్సి దశలో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హూడా డకౌట్‌గా వెనుదిరిగాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook