CSK vs MI match Highlights from IPL 2021: ఐపీఎల్ 2021 రెండో విడత షెడ్యూల్లో భాగంగా దుబాయ్‌లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన తీరు చూస్తే.. పడి లేచిన కెరటం అన్న చందంగా మ్యాచ్ కొనసాగింది. ముందుగా బ్యాటింగ్‌కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం 24 పరుగులకే నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయింది. డుప్లెసిస్, మొయీన్ అలీ, అంబటి రాయుడు లాంటి క్రికెటర్స్ తమ ఆట తీరుతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశారు. అయినప్పటికీ.. యువ కెరటం రుతురాజ్ గైక్వాడ్ (88 నాటౌట్) (Ruturaj Gaikwad) రెచ్చిపోవడంతో ఆ జట్టు అంతిమంగా విజయాన్ని అందుకుంది. మొత్తం 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు బాది అజేయంగా 88 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) పోరాట పటిమకు తోడు చెన్నై జట్టు బ్యాటింగ్ చివర్లో రవీంద్ర జడేజా (26), బ్రావో (23 ) సహకారం అందించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి చెన్నై సూపర్ కింగ్స్ 156 పరుగులు చేసి పరువు నిలబెట్టుకుంది. అనంతరం 157 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని (CSK beats MI) చవిచూసింది.
Also read : Virat Kohli to quit RCB captaincy: ఐపిఎల్ 2021 తర్వాత RCB కెప్టేన్‌గా వైదొలగనున్న విరాట్ కోహ్లీ
ముంబై ఇండియన్స్ ఆటగాళ్లలో సౌరభ్ తివారీ (Saurabh Tiwary) అర్ధ సెంచరీతో (40 బంతుల్లో 5 ఫోర్లు) ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చినప్పటికీ.. అతడి పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు బ్రావో, దీపక్ చాహర్ విసిరిన బంతులకు ముంబై ఇండియన్స్ జట్టు 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డి కాక్ (17), అన్మోల్ ప్రీత్ సింగ్ (16), సూర్యకుమార్ యాదవ్ (3), ఇషాన్ కిషన్ (11), కెప్టెన్ కీరన్ పొలార్డ్ (15) సీఎస్కే బౌలర్ల బంతులను ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడ్డారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు (Mumbai Indians) 20 పరుగుల తేడాతో పరాజయం పాలవకతప్పలేదు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో బ్రావో 3 (Dwayne Bravo), దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టారు. హాజిల్‌వుడ్, శార్దూల్ ఠాకూర్లకు చెరో వికెట్ దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన రుతురాజ్ గైక్వాడ్‌కు (Ruturaj Gaikwad) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. మొత్తంగా చెన్నై స్కోర్ పెరగడంలో రుతురాజ్ కీలకంగా వ్యవహరిస్తే.. ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేయడంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు (Chennai Super Kings players) సఫలం అయ్యారు. ఫలితంగా ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) సేన తమ వైపు తిప్పుకోలిగింది.
Also read : Rohit Sharma: ఆ మూడూ కొట్టేస్తే.. హిట్ మ్యాన్ ఖాతాలో మరో రికార్డ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook