/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

CSK captain MS Dhoni also needs to retire from IPL to play CSA T20 league: బీసీసీఐ ఆధ్వర్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ టోర్నీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడేందుకు అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఐపీఎల్ అనంతరం ఎన్నో లీగ్‌లు (CPL, BBL, PSL) వచ్చినా.. అవేమీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక CSA T20 లీగ్ మరియు ILT20 రూపంలో వచ్చే ఏడాది మరో రెండు లీగ్‌లు రానున్నాయి. 

దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు వచ్చే ఏడాది సౌతాఫ్రికా టీ20 (సీఎస్ఏ టీ20) లీగ్‌ టోర్నీతో ముందుకు రాబోతుంది. ఈ టోర్నీ జనవరిలో నిర్వహించే అవకాశం ఉంది. పేరుకు ఇది సౌతాఫ్రికా లీగ్‌ అయినా.. ఇందులో పాల్గొనబోయే ఆరు జట్లను ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగమైన ఫ్రాంఛైజీలే కొనుగోలు చేయడం విశేషం. జోహన్నెస్‌బర్గ్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌, కేప్‌టౌన్‌ ఫ్రాంఛైజీని ముంబై ఇండియన్స్‌, డర్బన్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌, ప్రిటోరియాను ఢిల్లీ క్యాపిటల్స్‌, పోర్ట్‌ ఎలిజబెత్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పర్ల్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకున్నాయి. 

చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్ ధోనీని సీఎస్ఏ టీ20లోని జోహన్నెస్‌బర్గ్‌ జట్టు కోసం మెంటార్‌గా నియమించిందన్న వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఓవర్సీస్ లీగ్‌లో మహీ ఆడటం ఖాయం అని భావించారు. మరోవైపు ఐపీఎల్ ప్రాంచైజీలే సీఎస్ఏ టీ20లో జట్లను కొనుగోలు చేయడంతో దక్షిణాఫ్రికా లీగ్‌లో భారత ఆటగాళ్లు కూడా భాగం కానున్నారా? అనే సందేహాలు ప్రతి క్రికెట్ అభిమానిలో మొదలయ్యాయి. ఈ విషయంపై బీసీసీఐ అధికారి ఒకరు పూర్తి క్లారిటీ ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ధోనీ కూడా ఓవర్సీస్ లీగ్ ఆడలేడని చెప్పారు. 

బీసీసీఐ అధికారి ఓ మీడియాతో మాట్లాడుతూ... 'దేశవాళీ ఆటగాళ్లతో సహా ఏ భారతీయ ఆటగాడు కూడా అన్ని రకాల ఫార్మాట్ల నుంచి  రిటైర్ అయ్యే వరకు మరే ఇతర లీగ్‌లో పాల్గొనలేడు. ఒకవేళ ఎవరైనా ఇతర లీగ్‌లలో ఆడాలనుకుంటే.. బీసీసీఐతో సంబంధాలు అన్నీ తెంచుకోవాల్సి ఉంటుంది. ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యి ఉండవచ్చు. అయితే అతను విదేశీ జట్టులో ఆడటానికి లేదా ఏదైనా పాత్రను స్వీకరించడానికి ఐపీఎల్ నుంచి రిటైర్ కావాల్సి ఉంటుంది' అని పేర్కొన్నారు. 

Also Read: నెవర్ బిఫోర్.. ఒకే ఓవర్లో 22 పరుగులు బాదిన పుజారా! 73 బంతుల్లోనే సెంచరీ

Also Read: Weight Loss: ఈ టీలను క్రమం తప్పకుండా తాగితే.. సులభంగా బరువు తగ్గుతారు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Section: 
English Title: 
CSK captain MS Dhoni also needs to retire from IPL to play CSA T20 league says BCCI
News Source: 
Home Title: 

సీఎస్ఏ టీ20, ఐఎల్ టీ20లో ఎంఎస్ ధోనీ ఆడుతాడా.. పూర్తి క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!

BCCI about MS Dhoni: సీఎస్ఏ టీ20, ఐఎల్ టీ20లో ఎంఎస్ ధోనీ ఆడుతాడా.. పూర్తి క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!
Caption: 
Source: File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

వచ్చే ఏడాది మరో రెండు లీగ్‌లు

సీఎస్ఏ టీ20లో ఎంఎస్ ధోనీ ఆడుతాడా

పూర్తి క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

Mobile Title: 
సీఎస్ఏ టీ20, ఐఎల్ టీ20లో ఎంఎస్ ధోనీ ఆడుతాడా.. పూర్తి క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!
P Sampath Kumar
Publish Later: 
No
Publish At: 
Saturday, August 13, 2022 - 14:21
Request Count: 
70
Is Breaking News: 
No