Moeen Ali: టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఆటగాడు..అసలు కారణం ఏంటంటే..

Moeen Ali Retires From Test Cricket: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మొయిన్‌ అలీ రిటైర్మెంట్‌ అంశాన్ని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) సైతం దృవీకరించింది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2021, 04:51 PM IST
  • టెస్ట్‌ క్రికెట్‌కు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ గుడ్ బై
  • ధృవీకరించిన ఈసీబీ
  • ప్రసుతం ఐపీఎల్ లో సీఎస్కే తరుపున ఆడుతున్న మెయిన్ అలీ
Moeen Ali: టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఆటగాడు..అసలు కారణం ఏంటంటే..

Moeen Ali Retires From Test Cricket: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB) ఈమేరకు వివరాలు వెల్లడించింది. టెస్ట్ క్రికెట్(Test Cricket) నుంచి మొయిన్ అలీ తప్పుకుంటున్నట్లు గత రాత్రి వెలువడింది. అయితే, మొయిన్ అలీ తన నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తాడని బోర్డు వెల్లడించింది. 

ప్రస్తుతం ఐపీఎల్ 2021 లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) తరఫున ఆడుతున్న మొయిన్ అలీ(Moeen Ali), తనకు 34 సంవత్సరాలు వచ్చాయని, వీలైనంత కాలం క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. టెస్ట్ క్రికెట్ చాలా గొప్పదని, అయితే ప్రస్తుతం ఈ ఫార్మాట్‌కు ఆడడం అంత కరెక్ట్ కాదని అనుకుంటున్నట్లు బోర్డుకు తెలిపాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు.

Also Read:Women cricket: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..600వికెట్ల క్లబ్ లో ఝుల‌న్ గోస్వామి

క్రికెట్ ప్రస్థానం
ఇంగ్లండ్ తరఫున 64 టెస్టులు ఆడిన 34 ఏళ్ల మొయిన్ అలీ.. టెస్టు జట్టుతో నిరంతరంగా ప్రయాణం చేశారు. 2014 లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన మొయిన్, 111 ఇన్నింగ్స్‌లలో 28.29 సగటుతో 2914 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 36.66 సగటుతో మొత్తం 195 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో ఐదుసార్లు ఐదు వికెట్లు తీసి పలు రికార్డులు కూడా సాధించాడు.2019 యాషెస్ సిరీస్ త‌ర్వాత టెస్ట్‌ల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత్‌(India)తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మొయిన్‌ అలీ  తన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు.

2017 లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓవల్ టెస్టులో మొయిన్ అలీ హ్యాట్రిక్ సాధించాడు. పదవీ విరమణ తర్వాత మాట్లాడుతూ, ‘టెస్ట్ జట్టు నుంచి తొలగించడం, మరలా కాంట్రాక్ట్ పొందకపోవడంతో 2019 లోనే నేను రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతం ఫ్రాంచైజ్ క్రికెట్‌పై దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News