Kavya Maran: వేలంలో 'తగ్గేదేలే' అన్న కావ్య మారన్.. యువ ఆటగాడిని పోటీపడి మరీ దక్కించుకుందిగా!

Sunrisers Eastern Cape owner Kavya Maran's CSA T20 League Auction Images goes viral. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ వేలంలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ సీఈఓ కావ్య మారన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 20, 2022, 01:27 PM IST
  • వేలంలో 'తగ్గేదేలే' అన్న కావ్య మారన్
  • యువ ఆటగాడిని పోటీపడి మరీ దక్కించుకుందిగా
  • 'గేమ్ ఛేంజర్' అని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి
Kavya Maran: వేలంలో 'తగ్గేదేలే' అన్న కావ్య మారన్.. యువ ఆటగాడిని పోటీపడి మరీ దక్కించుకుందిగా!

Sunrisers Eastern Cape owner Kavya Maran goes huge bid for Tristan Stubbs: దక్షిణాఫ్రికా టీ20 లీగ్ వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ మొదటి సీజన్‌లో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు ఆడనున్నాయి. ఈ ఆరు జట్లను ఐపీఎల్ టోర్నీలో పాల్గొనే ప్రాంచైజీలే కొనుగోలు చేశాయి. తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్.. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను సొంతం చేసుకుంది. 

దక్షిణాఫ్రికా టీ20 లీగ్ మొదటి ఎడిషన్ కోసం కేప్ టౌన్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆటగాళ్ల వేలం సోమవారం (సెప్టెంబర్ 19) మొదలైంది. ఈ వేలంలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ సీఈఓ కావ్య మారన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కావ్య మారన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె క్యూట్ లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు వేలంలో 'తగ్గేదేలే' అంటూ యువ ఆటగాడి కోసం పోటీపడిన వీడియో కూడా తెగ చక్కర్లు కొడుతోంది. 

దక్షిణాఫ్రికాకు చెందిన 22 ఏళ్ల ట్రిస్టన్ స్టబ్స్ కోసం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ యజమాని కావ్య మారన్.. ముంబై ఇండియన్స్ జట్టుతో పోటీపడి మరి కైవసం చేసుకున్నారు. ట్రిస్టన్ కనీస ధర 175k కాగా.. సన్‌రైజర్స్ 9.2Mకు (రూ. 9.2 కోట్లకు) సొంతం చేసుకుంది. ముంబై 9.1M వరకు పాడి వెనక్కి తగ్గింది. దాంతో కావ్య విజయవంతమైన బిడ్ గెలుచుకున్నారు. 22 ఏళ్ల ట్రిస్టన్ ఈ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 

ఐపీఎల్‌ 2022లో ముంబై ఇండియన్స్ జట్టులో భాగమైన ట్రిస్టన్ స్టబ్స్ పెద్దగా రాణించలేదు. అయితే క్రికెట్ సర్కిల్‌లలో మాత్రం డెడ్లీ ఫినిషర్‌గా పేరు పొందాడు. స్టబ్స్ 34 గేమ్‌లలో 30.15 సగటు మరియు 160.65 స్ట్రైక్ రేట్‌తో 784 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో నాలుగు అర్ధ సెంచరీలు కూడా చేశాడు. అతని స్ట్రైక్ రేట్ చూసి 'గేమ్ ఛేంజర్' అని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌పై 28 బంతుల్లో 72 రన్స్ బాదాడు. 

Also Read: చండీగఢ్‌ యూనివర్సిటీ వీడియో లీక్స్ ఇష్యూకు ఎండ్‌ కార్డు.. చివరకు ఏం తేలిందంటే!

Also Read: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టీ20.. కార్తీక్, అశ్విన్‌లకు నిరాశే! తుది జట్టు ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News