UAFA నేషన్స్ లీగ్ ను మిస్ అవుతున్న ఫుట్ బాల్ లెజెండ్ క్రస్టినో రోనాల్డో ( Cristino Ronaldo ) పోర్చుగల్ , క్రోయేషియా మధ్య జరుగుతున్న మ్యాచును చూడటానికి స్టాండ్స్ లో కూర్చున్నాడు. ఆట మధ్యలో ఒక గ్రౌండ్ సిబ్బంది వచ్చి ఆయన్ను మాస్కు వేసుకోమని కోరారు. మ్యాచు సిబ్బంది సలహాను పాటించిన లెజెండ్ వెంటనే మాస్కు వేసుకున్నాడు. అయితే గ్రౌండ్ లో ఉండాల్సిన రోనాల్డో స్టాండ్స్ లో ఎందుకు ఉన్నాడు అనేగా మీరు ఆలోచిస్తోంది. రోనాల్డో ఒక వింత కారణం వల్ల మ్యాచుకు దూరం అయ్యాడు.
మ్యాచు కోసం ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు ( Football )రోనాల్డో చాలా కాలం నుంచి సాధన చేస్తున్నాడు. అయితే ఇటీవలే ఒక రోజు నిద్రలేచి చూస్తే కాలు మొత్తం బాగా వాచింది. చెక్ చేయిస్తే అది తేనెటీగ కరవడం ( Bee Sting ) వల్ల జరిగింది అని తేలింది. ఈ వాపు తగ్గేంతవరకు ప్రాక్టిస్ కు దూరంగా ఉండమని వైద్యులు సలహా ఇవ్వడంతో రోనాల్డో ఇప్పుడు స్టాండ్స్ కు మాత్రమే పరిమితం అయ్యాడు. త్వరలో మళ్లీ కిక్ బ్యాక్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
Nunca se esqueçam da máscara 😷 pic.twitter.com/hNPmHOwUyY
— B24 (@B24PT) September 5, 2020