ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ అలెక్స్ హేల్స్‌కు ప్రమాదకర కరోనా వైరస్ సోకిందని ప్రచారం జరిగింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఆడేందుకు పాక్‌కు వెళ్లిన హేల్స్ అంతలోనే ఇంగ్లాండ్ తిరుగు ప్రయాణం కావడంతో ఈ వదంతులు పుట్టుకొచ్చాయి. కరోనా సోకిందరన్న ఆరోపణలపై హేల్స్ స్పందించాడు. తనకు క్రికెట్ కన్నా బతికుండటమే ముఖ్యమని, కుటుంబం కోసం జీవించాల్సిన అవసరం ఉందన్నాడు. ఆరోపణలు తీవ్రరూపం దాల్చడంతో కుటుంబం, సన్నిహితులు ఆందోళన చెందుతారన్న నేపథ్యంలో వదంతులపై వివరణ ఇస్తున్నట్లు తెలిపాడు.
Read also : కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?
‘కరోనా సోకిందని ప్రచారం జరిగినందుకు వదంతులపై స్పందించాల్సి వచ్చింది. ఇతర విదేశీ క్రికెటర్ల తరహాలోనే నేను కూడా స్వదేశానికి తిరిగి వచ్చేశాను. వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ప్రమాదకర కోవిడ్19 లాంటి వైరస్ బారిన పడే కంటే కుటుంబంతో కలిసి ఉండటమే ముఖ్యమని భావిస్తున్నాను. అందుకే యూకేకు తిరిగొచ్చేశా. పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. ఎలాంటి ఆనారోగ్య సమస్యలు లేవు. వచ్చిన రోజు బాగానే ముగిసింది. మరుసటి రోజు ఆదివారం కూడా ఏ అనారోగ్య లక్షణాలు నా దరి చేరలేదు.
Also Read: కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ వాయిదా
ప్రభుత్వ హెచ్చరికలు, సూచనల నేపథ్యంలో ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. దగ్గు (Cough) సమస్య ఉంది. అయితే అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. కరోనా టెస్టుల ఫలితాలు వచ్చాక మరిన్ని వివరాలు అందిస్తాను. ఇప్పటివరకైతే అంతా సజావుగానే సాగుతోందని’ క్రికెటర్ అలెక్స్ హేల్స్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8వేల మంది కరోనా బారిన పడి చనిపోగా, మరో 2లక్షల మందికి కోవిడ్19 పాజిటీవ్ అని తేలింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.
‘క్రికెట్ కన్నా ప్రాణాలే ముఖ్యం’