జస్ప్రీత్ బుమ్రా(24) ఫిట్నెస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అతడిని ఇంగ్లాండ్ టెస్టులో ఆడించాలా? వద్దా?అనే దానిపై సందిగ్దత కొనసాగుతోంది. చేతి వేలి గాయంతో ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు దూరమైన బుమ్రా ఫిట్నెస్‌పై ఇంకా అనుమానాలు పెరుగుతున్నాయి. లండన్‌లో బుమ్రా చేతికి శస్త్రచికిత్స జరిగింది. అది అంతగా విజయవంతం కాలేదని బీసీసీఐ ప్రతినిధి ఒకరు జాతీయ మీడియాకు వెల్లడించారు. బౌలింగ్ చేసే చేతికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో బుమ్రాను బ్యాండేజీలతో ఐనా టెస్టు సిరీస్‌లో ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోందని సమాచారం.
జూన్ 27న ఐర్లాండ్‌తో జరిగిన టీ20లో బుమ్రా గాయపడ్డాడు. తర్వాత కోలుకుంటాడని భావించినా.. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు.
గత వారంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్ట్ సిరీస్‌కు బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించింది. వారిలో విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దిప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్‌లను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.