చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌గా బ్రెట్‌లీ..?

ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్‌లీ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌కు కోచ్‌గా నూతన బాధ్యతలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Last Updated : Jan 3, 2018, 04:23 PM IST
చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌గా బ్రెట్‌లీ..?

ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్‌లీ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌కు కోచ్‌గా నూతన బాధ్యతలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఐపీఎల్‌లో బలమైన జట్టుగా పాల్గొని, ఇతర జట్లకు మంచి పోటీ ఇవ్వాలని భావిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే ఎంఎస్ ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా లాంటి దిగ్గజ ప్రేయర్లతో ఐపీఎల్ కాంట్రాక్టు కుదుర్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ తరుణంలో ఈ జట్టు ఇప్పుడు కోచ్‌ల విషయంలో కూడా కీలక నిర్ణయాన్ని తీసుకోవాలని భావిస్తోంది. జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్‌-11వ సీజన్‌ ఆటగాళ్ల కోసం వేలం జరగనున్న క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ భారీ అంచనాలతో, ప్రణాళికతో రంగంలోకి దిగాలని భావిస్తోంది. స్పాట్ ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో ఈ జట్టుపై 2015లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

 

Trending News