టీమ్ ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ పెళ్లికి రంగం సిద్ధమైంది. ఈ నెల 23వ తేదీన ఆయన మీరట్లో తన బంధుమిత్రుల సమక్షంలో నుపుర్ నగర్ అనే అమ్మాయిని వివాహమాడనున్నారు. అయితే నవంబరు 26 నుండి 30వ తేదీ వరకు ఢిల్లీలోని బులంద్ షహర్లో రిసెప్షన్ జరగనుంది. "నవంబరు 30వ తేదీన శ్రీలంక సిరీస్ ఢిల్లీలో జరగబోతుంది. కావున, టీమంతా ఇక్కడే ఉంటుంది. అందుకే రిసెప్షన్ తేదీని ఆ రోజు వరకు పొడిగించాం" అని భువనేశ్వర్ తండ్రి తెలిపారు. ఇప్పటికే తన ఎంగేజ్ మెంట్ గ్రేటర్ నోయిడాలో జరిగిందని ప్రకటించారు భువనేశ్వర్ కుమార్. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను కూడా తన ఇన్స్టాగ్రాంలో పోస్టు చేశారు. భువనేశ్వర్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్. తొలుత దేశీవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్ తరపున ఆడిన భువనేశ్వర్ ప్రస్తుతం టీమ్ ఇండియాలో కీలక బౌలర్. 78 వన్డేలు ఆడిన ఈ యంగ్ పేసర్ మొత్తం 85 వికెట్లు తీశారు. టెస్టుల్లో 45 వికెట్లు తీశారు.
క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ పెళ్లి ఫిక్స్