ప్రపంచ బ్యాట్స్‌మెన్లకు భూవీ హెచ్చరిక !!

టీమిండియా బౌలింగ్ సామర్ధ్యంపై  ఫేసర్ భువనేశ్వర్ కుమార్ స్పందించాడు

Last Updated : May 16, 2019, 04:23 PM IST
ప్రపంచ బ్యాట్స్‌మెన్లకు భూవీ హెచ్చరిక !!

మరో కొన్ని రోజుల్లో క్రికెట్ ప్రపంచకప్‌ సమరం మొదలౌతోంది. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్న టీమిండియా విషయంలో బ్యాటింగ్ పటిష్ఠంగా ఉన్నప్పటికీ బౌలింగ్ పై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ సామర్ధ్యంపై టీమిండియ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పందించాడు.

ప్రస్తుతం టీమిండియా బౌలర్లు ఎలాంటి పిచ్‌ మీదయినా రాణించగలరని భూమీ ధీమా వ్యక్తం చేశాడు. గత ప్రదర్శనే ఇందుకు నిదర్శనమన్నాడు. జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, కుల్‌దీప్‌ యాదవ్‌ల బౌలింగ్‌ తీరు ఎలాంటిదో అన్ని జట్లు ఇప్పటికే రుచి చూశాయని....తాను సామర్థ్యం మేరకు ప్రపంచ కప్‌లో రాణిస్తానని ధీమా వ్యక్తం చేశారు. 

భారత్ బౌలింగ్ తక్కువ అంచనా వేయవద్దని ఈ సందర్భంగా ప్రపచంలోని బ్యాట్స్ మెన్లకు భువనేశ్వర్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ కప్ లో సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగుతున్నామని.. భారత్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బ్యాట్స్ మెన్లకు భూవీ సవాల్ విసిరాడు

వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించుకున్న కుల్ దీప్, మొహమ్మద్ షమీలు ఐపీఎల్‌లో ఫామ్‌ కోల్పోయిన విషయం తెలిసిందే.  ఇరువురు ఈ టోర్నీలో స్థాయి తగ్గట్లుగా ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ ముంగిట టీమిండియా బౌలర్ల ఫామ్‌పై వస్తున్న విమర్శలపై టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ స్పందించాడు. 
 

Trending News