BCCI on Virat Kohli: 'వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్​ కోహ్లీని తప్పించే యోచనలో బీసీసీఐ!'

BCCI on Virat Kohli: విరాట్​ కోహ్లీని అదనపు బాధ్యతల నుంచి తప్పించి.. బ్యాటింగ్​పై దృష్టి పెట్టేలా చూసేందుకు బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన్ను వన్డే కెప్టెన్​గా తప్పించొచ్చని సమాచారం!

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 07:15 PM IST
  • కోహ్లీ భవిష్యత్​పై చర్చించే యోచనలో బీసీసీఐ!
  • వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించొచ్చని సమాచారం
  • బ్యాంటింగ్​పై దృష్టి పెట్టేలా చూసేందుకే నిర్ణయం!
BCCI on Virat Kohli: 'వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్​ కోహ్లీని తప్పించే యోచనలో బీసీసీఐ!'

BCCI wants to relieve Kohli from the burden of captaincy: టీ20 వరల్డ్ కప్ తర్వాత.. పొట్టి క్రికెట్ ఫార్మాట్​ కెప్టెన్సీ నుంచి విరాట్​ కోహ్లీ తప్పుకున్నాడు. టోర్నీ ప్రారంభం కాకముందే ఈ విషయాన్ని కోహ్లీ స్పష్టం (Virat Kohili) చేశాడు. దీనితో ఇటీవల టోర్నీ నుంచి టీమ్ ఇండియా నిష్క్రమించిన నేపథ్యంలో.. టీ20 కెప్టెన్​గా రోహిత్ శర్మను నియమిస్తూ బీసీసీఐ (BCCI on Rohit Sharma) నిర్ణయం తీసుకుంది.

టీ20 వరల్డ్​కప్ ముగిసిన అనతంరం న్యూజిలాండ్​తో ఇండియా మూడు టీ20లు, రెండు టెస్టు సిరీస్​లు ఆడనుంది. ఇందులో మూడు టీ20లకు, ఓ టెస్ట్​ సిరీస్​కు కోహ్లీని విశ్రాంతిలో ఉంచింది బీసీసీఐ. పని ఒత్తిడి, వరుస మ్యాచ్​ల కారణంగా అతడు ఇబ్బంది పడుతున్నాడని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

న్యూజిలాండ్​తో టెస్టుకు (India vs NZ) కోహ్లీతో పాటు.. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చింది బీసీసీఐ. దీనితో అజింక్యా రహానే కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. ఇక వైస్ కెప్టెన్​గా ఛతేశ్వర్‌ పుజారా పేరును ప్రకటించింది బీసీసీఐ. మరోవైపు స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ లకు టెస్టులకు విశ్రాంతినిచ్చింది. కాగా ఈ సిరీస్‌తో శ్రేయస్‌ అయ్యర్‌ భారత్‌ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

Also read: Sania Mirza Supports Pakistan: సానియా మీర్జా భారత పౌరసత్వాన్ని రద్దు చేయండి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

Also read: Australia Vs Pakistan: ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త బంతి విసిరిన బౌలర్.. వీడియో వైరల్

అదనపు బాధ్యతల నుంచి విరాట్​కు విముక్తి?

ఇదిలా ఉండగా.. ఓ కొత్త విషయం తెరపైకి వచ్చింది. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీనే స్వయంగా తప్పుకున్నా.. వన్టే, టెస్టు కెప్టెన్​గా అతడే కొనసాగుతున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఓ నివేదికలో ద్వారా తెలిసిన వివరాల ప్రకారం.. వన్డేల్లో కూడా కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. కోహ్లీకి అదనపు ఒత్తిడి తగ్గించి బ్యాటింగ్​పై దృష్టి సారించడం కోసమే బీసీసీఐ ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనితో అతడు పాత ఫామ్​ను పొందొచ్చని కూడా బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్​కు ముందే బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవచ్చని కూడా ఈ నివేదిక ద్వారా తెలిసింది. ఇక దీనితో పాటు.. వన్డే వైస్​ కెప్టెన్​గా కేఎల్​ రాహుల్​ను ఎంపిక చేయొచ్చని కూడా సమాచారం.

Also read: India Vs New Zealand Series: న్యూజిలాండ్ తో టెస్టులకు ఇండియన్ టీమ్ ప్రకటన.. రోహిత్, పంత్, షమీకి విశ్రాంతి

Also read: Devon Conway Injury: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ జట్టుకు షాక్.. కీలక ఆటగాడు దూరం

మాజీ కోచ్​ రవిశాస్త్రి ఎమన్నాడంటే..

కెప్టెన్సీ నుంచి విరాట్​ కోహ్లీని తప్పించాలని బీసీసీఐ భావిస్తోందని నివేదిక చెబుతుంటే.. టీమ్​ ఇండియా మాజీ కోచ్​ రవి శాస్త్రి  మరో కోణం బయటపెట్టాడు. విరాట్​  కోహ్లీ స్వయంగా వన్డే, టెస్టు కెప్టెన్సీని వదులుకునే అవకాశముందన్నాడు. బ్యాటింగ్​పై దృష్టి సారించేందుకు కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాడు. అయితే ఇది ఇప్పట్లో జరగకపోవచ్చని ఇందుకు కొంత సమయం పడుతుందని వివరించాడు.

Also read: Neeraj Chopra: 'నేను మరిన్ని పతకాలు సాధించాలి..తర్వాతే బయోపిక్'..

Also read: Warner Six On Dead Ball: ‘వార్నర్ అలాంటి షాట్ ఆడడం సిగ్గుచేటు’.. గౌతమ్ గంభీర్ ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News