BCCI to introduced New Rules for IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్‌కు సమయం దగ్గరపడుతోంది. క్యాష్ రిచ్ లీగ్ మార్చి 26న ముంబైలో ప్రారంభం కానుంది. లక్నో సూపర్ జెయింట్స్ మరియు గుజరాత్ టైటాన్స్ కొత్తగా రావడంతో 65 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించేందుకు మెగా టోర్నీ సిద్ధంగా ఉంది. వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. అయితే ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.
ఐపీఎల్ 2022 నిబంధనల్లో పలు కీలక మార్పులు చేసేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఓ బీసీసీఐ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. డీఆర్ఎస్, సూపర్ ఓవర్, ఏదైనా జట్టు మ్యాచుకు ముందు కరోనా బారిన పడితే ఏం చెయ్యాలనే విషయాలపై నయా రూల్స్ వచ్చాయట. అంతేకాదు ఇటీవల మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలను కూడా ఐపీఎల్ టోర్నీలో ప్రవేశపెట్టనుందట.
# ఏదైనా జట్టులోని సభ్యులు కరోనా బారిన పడి మ్యాచుకు 12 మంది ఆటగాళ్లు అందుబాటులో లేనప్పుడు.. గతంలో మాదిరిగా బీసీసీఐ ఆ మ్యాచును రీషెడ్యూల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అదీ సాధ్యం కాని పరిస్థితుల్లో ఈ విషయాన్ని ఐపీఎల్ సాంకేతిక కమిటీకి సూచిస్తుంది. ఆ కమిటీనే మ్యాచ్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటుంది.
# డీఆర్ఎస్ విషయంలో కూడా బీసీసీఐ కొత్త నియమావళిని తీసుకొచ్చింది. ఇదివరకు ప్రతి ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టు ఒక్కో సమీక్ష కోరే వీలు మాత్రమే ఉండేది. కానీ దాన్ని ఇప్పుడు రెండుకు పెంచారు. దీంతో ఒక్కో జట్టు ఇన్నింగ్స్‌లో రెండు రివ్యూలను తీసుకోవచ్చు.
# ఎంసీసీ తాజాగా తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం.. ఎవరైనా బ్యాటర్ క్యాచ్ ఔట్ ద్వారా పెవిలియన్ చేరినప్పుడు క్రీజులోకి కొత్తగా వచ్చే బ్యాటర్ స్ట్రైకింగ్ చేయాలి. ఇదివరకు ఇది నాన్ స్ట్రైక్ వైపునకు ఉండేది.
# ప్లేఆఫ్స్ లేదా ఫైనల్ వంటి కీలక మ్యాచులలో ఫలితం తేలకుండా 'టై'గా మారితే.. నిర్ణీత సమయంలో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అది కూడా కుదరని పక్షంలో లీగ్ స్టేజ్‌లో పాయింట్ల ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు.
Also Read: Russian Model Murdered: పుతిన్ పై విమర్శలు చేసిన రష్యన్ మోడల్ మృతి.. సూటుకేసులో మృతదేహం లభ్యం!
Also Read: Rashmika Mandanna: యువ హీరోతో రష్మిక మందన్న రొమాన్స్.. సూపర్ కాంబో!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook