Sourav Ganguly: టీమ్ ఇండియా క్రికెట్‌లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీ20తో పాటు వన్డే కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించాడు. ఈ నేపధ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బీసీసీఐ టీమ్ ఇండియాలో చాలా మార్పులు చేసింది. విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20ల్లో ముందు కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించిన బీసీసీఐ..తాజాగా వన్డే పగ్గాలు కూడా రోహిత్ శర్మకే అప్పగించింది. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్ బాధ్యతల్నించి తొలగించడం అనూహ్య పరిణామం. అందరికీ షాక్‌కు గురి చేసింది. ఈ వ్యవహారం వెనుక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాత్ర ఉందనే విషయం అతడి మాటలతోనే వ్యక్తమైంది. సౌరవ్ గంగూలీ ఒత్తిడి మేరకే విరాట్ కోహ్లీని(Virat kohli) తొలగించినట్టు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.
రోహిత్ శర్మపై సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) ప్రశంసలు కురిపించాడు. టీమ్ ఇండిాయను విజయపథంలో నడిపించగల సత్తా రోహిత్ శర్మకు ఉందని..ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు 5 సార్లు టైటిల్ అందించాడాని గంగూలీ కొనియాడాడు. అందుకే సెలెక్షన్ కమిటీ రోహిత్ శర్మను ఎంపిక చేసిందని..విజయం కోసం రోహిత్ శర్మ కొత్త వ్యూహాలు రచిస్తాడని చెప్పాడు. రోహిత్‌పై (Rohit Sharma)తనకు పూర్తి నమ్మకముందని గంగూలీ ప్రశంసించాడు. ఐపీఎల్ కెప్టెన్‌గా అతడి రికార్డు అద్భుతమని చెప్పాడు. కోహ్లీ గైర్హాజరీలో 2018లో ఆసియా కప్‌కు సారధ్యం వహించి.. ట్రోఫీని సాధించిపెట్టాడన్నాడు. కోహ్లీ లేకుండా టైటిల్ గెలిచి తన సత్తా ఏంటనేది చెప్పాడన్నాడు.
Also read: Virat kohli and Anushka: విరాట్ కోహ్లి, అనుష్కల చిలిపితనం మామూలుగా లేదుగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Sourav Ganguly: కోహ్లీ లేకుండానే టీమ్ ఇండియాకు టైటిల్, రోహిత్‌పై గంగూలీ ప్రశంసలు