Indias Squad for Tour of Zimbabwe: టీ20 ప్రపంచ కప్‌లో అదరగొడుతున్న భారత్.. పొట్ట కప్ ముగిసిన వెంటనే జింబాబ్వేలో పర్యటించనుంది. జూలై 6వ తేదీ నుంచి రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు సీనియర్లందరికీ సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఐపీఎల్లో అదరగొట్టిన ప్లేయర్లకు అవకాశం కల్పించారు. శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ అవకాశం దక్కింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ప్రకటించారు. తెలుగు సంచలనం నితీష్ రెడ్డితోపాటు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్ పాండే తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యారు.
ప్రస్తుతం వరల్డ్ కప్ టీమ్ నుంచి యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్‌ను మాత్రమే ఎంపిక చేశారు. కేవలం ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను మాత్రమే ఎంపిక చేశారు. అయితే ఆల్రౌండర్లకు పెద్దపీట వేశారు. అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్‌లు బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించగలరు. సంజూ శాంసన్‌కు తోడు ధ్రువ్ జురెల్‌ను వికెట్ కీపర్‌గా తీసుకున్నారు.
జింబాబ్వే టూర్‌కు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ తుషార్ దేశ్‌పాండే.
టీ20 సిరీస్ షెడ్యూల్ ఇలా..
==> జూలై 6న 1వ టీ20
==> జూలై 7న శ 2వ టీ20
==> జూలై 10న 3వ టీ20
==> జూలై 13న బుధవారం 4వ టీ20
==> జూలై 14న శనివారం 5వ టీ20.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు.. ఎందుకంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter