Mitchell Marsh: ఇండియాలో నాకు శాపం తగిలిందంటున్న విదేశీ క్రికెటర్, ఏమైంది అసలు

Mitchell Marsh: ఐపీఎల్ 2022 ముగిసింది. టైటిల్ విన్నర్‌గా తొలిసారి బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అద్భుతమైన ఆల్‌రౌండర్స్ ఉన్న జట్లు ప్లే ఆఫ్‌కు ముందే నిష్క్రమించాయి. ఈ నేపధ్యంలో ఆ విదేశీ ఆటగాడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 5, 2022, 05:52 PM IST
Mitchell Marsh: ఇండియాలో నాకు శాపం తగిలిందంటున్న విదేశీ క్రికెటర్, ఏమైంది అసలు

Mitchell Marsh: ఐపీఎల్ 2022 ముగిసింది. టైటిల్ విన్నర్‌గా తొలిసారి బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అద్భుతమైన ఆల్‌రౌండర్స్ ఉన్న జట్లు ప్లే ఆఫ్‌కు ముందే నిష్క్రమించాయి. ఈ నేపధ్యంలో ఆ విదేశీ ఆటగాడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి..

ఈసారి ఐపీఎల్ 2022లో ఊహించని పరిణామాలే జరిగాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ వంటి మేటిజట్లు ప్లే ఆఫ్‌కు ముందే నిష్క్రమించాయి. తొలిసారి బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ టైటిల్ ఎగురేసుకుపోయింది. ఈ నేపధ్యంలో ఢిల్లీ కేపిటల్స్ ఆటగాడు మిచెల్ మార్ష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఢిల్లీ కేపిటల్స్ జట్టు ప్లే ఆఫ్ చేరకపోవడం సిగ్గుచేటుగా ఉందని మిచెల్ మార్ష్ వ్యాఖ్యానించాడు.హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆటగాళ్లను అద్భుతంగా చుూసుకున్నా..ఫలితం లేకపోయిందని చెప్పాడు. ప్లే ఆఫ్ చేరాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో..ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ కేపిటల్స్ ఓటమి పాలైంది. ఫలితంగా ప్లే ఆఫ్‌కు అడుగుదూరంలో నిలిచిపోయింది. హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్ జట్టును నడిపించిన తీరు అద్భుతమని..అతని కోసమైనా టైటిల్ గెలవాలని భావించినట్టు మార్ష్ చెప్పాడు. మార్ష్ ఈ ఐపీఎల్ సీజన్‌లో చాలా మ్యాచ్‌లకు దూరమయ్యాడు గాయం కారణంగా ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లు మిస్ కాగా..ఆ తరువాత కరోనా బారిన పడి మరికొన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఆ తరువాత 8 మ్యాచ్‌లు ఆడి 251 పరుగులు చేశాడు. 

ఇండియా వచ్చిన ప్రతిసారీ గాయపడుతున్నానని..ఇండియాలో తనకు శాపం తగిలిందని మార్ష్ పేర్కొన్నాడు. ముందు గాయం కారణంగా దూరమైతే..తరువాత ఒక మ్యాచ్ ఆడేసరికి కరోనా సోకడం శాపం కాక మరేంటని ప్రశ్నిస్తున్నాడు. 2020, 2021 ఐపీఎల్ సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడిన మిచెల్ మార్ష్ ఈసారి..ఢిల్లీ కేపిటల్స్ తరపున ఆడాడు. విశేషమేంటంటే..ఎస్ఆర్‌హెచ్ తరపున ఆడినప్పుడు కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. 

Also read: మా ఇంట్లో పైసల్ కాచే చెట్టు లేదు.. అందుకే ఐపీఎల్‌లో పనిచేస్తూ సంపాదిస్తున్నా: గౌతమ్ గంభీర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News