Asia Cup Hockey 2022: హాకీ ఆసియా కప్ తొలి మ్యాచ్ నువ్వానేనా అన్నట్లు సాగింది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య పోరు ఆసక్తికరంగా కొనసాగింది. ఆట చివరిలో పాకిస్థాన్ గోల్ చేయడంతో మ్యాచ్ 1-1 డ్రా అయ్యింది. ఆట మొదటి నుంచి భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. చివరిలో పుంజుకున్న పాక్ ఓ గోల్ చేయడంతో ఊపిరిపీల్చుకుంది. మ్యాచ్ ప్రారంభం అయిన మొదటి క్వార్టర్‌లోనే భారత ఆటగాడు కార్తీ సెల్వమ్ అద్భుత గోల్ కొట్టాడు.
ఆ తర్వాత రెండు క్వార్టర్లలో ఇరు జట్లు ఢీ అంటే ఢీ అనేలా తలపడ్డాయి. ఒక్క గోల్ సైతం రాలేదు. చివరిదైన నాలుగో క్వార్టర్‌లో పాక్ పుంజుకుంది. ఆ జట్టుకు పెనాల్టీ కార్నర్ లభించడంతో అబ్దుల్ రాణా ఉపయోగించుకున్నాడు. దీంతో స్కోర్లు సమంగా నిలిచాయి. ఈఏడాది ఆసియా కప్‌లో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. భారత్, పాకిస్థాన్ జట్లూ ఆసియా కప్‌ను మూడేసి సార్లు గెలుచుకున్నాయి. మరోవైపు మలేషియా, దక్షిణ కొరియా జట్లు తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించాయి. మలేషియా.. 7-0తో ఒమన్‌ను ఓడించింది. బంగ్లాదేశ్‌పై 6-1తో దక్షిణ కొరియా విజయం ఢంకా మోగించింది. రేపు జపాన్‌తో భారత్ పోటీ పడనుంది.
Also read:KCR Delhi Tour: ముగిసిన కేసీఆర్ ఢిల్లీ టూర్.. అనూహ్యంగా షెడ్యూల్ కన్నా ముందే హైదరాబాద్‌కు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook