India vs Pakistan: భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు అడ్డుపడిన వరుణుడు.. ఫలితం తేలని మ్యాచ్..

India vs Pakistan: పాక్ పేస్ దాడి ఎంత ప్రమాదకరమో భారత జట్టుకు మరోసారి తెలిసొచ్చింది. అయితే టీమిండియా బ్యాటర్లు కూడా మంచి పోరాటమే చేశారు. అయితే దాయాదులు హోరాహోరీ పోరుకు వరుణుడు అడ్డుపడటంతో మ్యాచ్ రద్దయింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 3, 2023, 09:28 AM IST
India vs Pakistan: భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు అడ్డుపడిన వరుణుడు.. ఫలితం తేలని మ్యాచ్..

India vs Pakistan Highlights, Asia Cup 2023: చిరకాల ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ పోరు తప్పదనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. వరుణుడు వారిపై ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో భారత్-పాక్ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. వరుణుడు అడ్డుపడటంతో పాక్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క బంతీ పడకుండానే మ్యాచ్‌ రద్దయింది. ఇప్పటికే నేపాల్ పై నెగ్గిన పాక్ జట్టు.. ఈ మ్యాచ్‌ రద్దవడంతో సూపర్‌-4కు క్వాలిఫై అయింది. టీమిండియా సోమవారం నేపాల్ తో తలపడనుంది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్ బ్యాటర్లకు పాక్ పేసర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా షహీన్‌ అఫ్రిది తన పేస్ తో టీమిండియా ఆటగాళ్లను బెంబేలెత్తించాడు. రెండు ఫోర్లు కొట్టి మంచి ఊపు మీదున్న రోహిత్ ను షహీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లిని కూడా అతడే ఔట్ చేశాడు. మరోవైపు హారిస్‌ రవూఫ్‌, నసీమ్‌ షా కూడా చెలరేగడంతో టీమిండియా బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. శుభ్‌మన్‌ (10), శ్రేయస్‌ అయ్యర్‌ (14) కూడా స్వల్ప స్కోర్లుకే వెనుదిరిగారు. దీంతో భారత్ 150 పరుగులైనా చేస్తుందోమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. 

అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య గొప్ప పోరాటం చేశారు. వీరు ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ముఖ్యంగా స్పినర్లను టార్గెట్ చేసుకుని వీరు స్కోరు సాధించారు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. టీమిండియా 300 మార్కును అందుకునేలా కనిపించింది. జట్టు స్కోరు 204 పరుగుల వద్ద ఇషాన్ (82 పరుగులు) ఔటయ్యాడు. మరోవైపు జడేజా అండతో హార్ధిక్ చెలరేగిపోయాడు. సెంచరీ చేసేలా కనిపించాడు. హార్దిక్‌ పాండ్య (87; 90 బంతుల్లో 7×4, 1×6), జడేజా లను షహీన్ ఒకే ఓవర్ లో ఔట్ చేసి భారత్ ను దెబ్బతీశాడు. టెయిలెండర్లు పెద్దగా పోరాడకపోవడంతో టీమిండియా  27 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లును కోల్పోయింది. బుమ్రా 16 పరుగులు చేశాడు.

Also Read: Rinku Singh: మళ్లీ సిక్సర్ల వర్షం కురిపించిన రింకూ సింగ్.. సూపర్ ఓవర్‌లో మెరుపులు.. వీడియో చూశారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News