Arshdeep Singh Death Over Bowling: అర్షదీప్ సింగ్.. డెత్ ఓవర్ బౌలింగ్ ఎక్స్‌పర్ట్

Arshdeep Singh Death Over Bowling: ఐపీఎల్ అర్షదీప్ సింగ్ పేరిట ఓ మంచి రికార్డు ఉంది. ప్రత్యేకించి ఈసీజన్‌లో డెత్ ఓవర్లలో అతని ఎకానమి అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. ఇండియన్ బౌలర్లు బుమ్రా, షమీ కంటే ఎంతో బెటర్‌గా (5.66) ఉంది. అంతేందుకు దక్షిణాఫ్రికా పేసర్ రబాడా కంటే అర్షదీప్ సింగ్ డెత్ ఓవర్ బౌలింగ్ ఎకానమి ఐపీఎల్ ఈ సీజన్‌లో బావుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 10:43 PM IST
  • అర్షదీప్‌కు ప్రతి మ్యాచ్‌లో బౌలర్‌గా అవకాశం కల్పిస్తోన్న పంజాబ్
  • డెత్ ఓవర్లలో బౌలింగ్‌లో నిరూపించుకుంటున్న అర్షదీప్‌
  • పెద్దగా వికెట్లు తీయకపోయినప్పటికీ వార్తల్లో నిలుస్తున్న అర్షదీప్
Arshdeep Singh Death Over Bowling: అర్షదీప్ సింగ్.. డెత్ ఓవర్ బౌలింగ్ ఎక్స్‌పర్ట్

Arshdeep Singh Death Over Bowling: ఐపీఎల్ అర్షదీప్ సింగ్ పేరిట ఓ మంచి రికార్డు ఉంది. ప్రత్యేకించి ఈసీజన్‌లో డెత్ ఓవర్లలో అతని ఎకానమి అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. ఇండియన్ బౌలర్లు బుమ్రా, షమీ కంటే ఎంతో బెటర్‌గా (5.66) ఉంది. అంతేందుకు దక్షిణాఫ్రికా పేసర్ రబాడా కంటే అర్షదీప్ సింగ్ డెత్ ఓవర్ బౌలింగ్ ఎకానమి ఐపీఎల్ ఈ సీజన్‌లో బావుంది. పంజాబ్ కింగ్స్ పేసర్ అర్షదీప్ సింగ్ ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లు ఆడితే అందులో కేవలం మూడు వికెట్లు మాత్రమే తీశాడు. సాధారణంగా ఐపీఎల్‌లో వికెట్లు తీస్తేనే ఆ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ డిఫరెంట్. అర్షదీప్ పెద్దగా వికెట్లు తీయకపోయినప్పటికీ.. మనం అతని గురించి చర్చించుకోవాలి. 

పంజాబ్ జట్టే అర్షదీప్‌కు ప్రతి మ్యాచ్‌లో బౌలర్‌గా అవకాశం కల్పిస్తోంది. వికెట్లు తీయకపోయినప్పటికీ అతను తుది జట్టులోకి వస్తున్నాడు. ఎందుకంటే డెత్ ఓవర్లలో అతని బౌలింగ్ ఎకానమి అలా ఉంటుంది. అందుకే పంజాబ్ టీంలో అర్షదీప్‌కు కచ్చితంగా చోటు ఉంటుందనే చెప్పుకోవాలి డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు నుంచి డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే పేసర్‌కు ఎంతో స్ట్రెస్ ఉంటుంది. దాన్ని తట్టుకుని మరీ బ్యాట్‌కు బంతి తాకకుండా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే రీసెంట్‌గా మనం చూసిన సన్ రైజర్స్ - గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లా ఉంటుంది ఫలితం. ఆ మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో SRH విఫలం అయింది. దీంతో గుజరాత్ బ్యాటర్లు రెచ్చిపోయారు. విజయాన్ని సొంతం చేసుకున్నారు. 

అలా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయాలంటే దమ్ము ఉండాలి. లేదంటే మ్యాచ్ ఫలితాన్ని మార్చేయవచ్చు. అర్షదీప్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ప్రశంసలు కురిపించాడు. అర్షదీప్ వేరియెషన్స్ ఎక్కువగా వేయలేకపోవచ్చు కానీ.. మంచి యార్కర్ స్పెషలిస్ట్. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌లో బాల్ వేయడంతో అర్షదీప్ దిట్ట. స్లో బాల్‌తో పాటు బంపర్‌లు కూడా వేస్తాడని గ్రేమ్ స్వాన్ అర్షదీప్‌ను ప్రశంసించాడు. అంతేకాదు.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా గతంలో అర్షదీప్‌ను ప్రశంసించిన సందర్భాలు మనం చూశాం. త్వరలోనే భారత జట్టుకు అర్షదీప్ ఆడే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

2018 అండర్ 19 వరల్డ్ కప్‌లో చోటు సంపాదించుకున్న అర్షదీప్ 2019లో పంజాబ్ తరఫున తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆ సీజన్‌లో పంజాబ్ జట్టు నుంచి రెండో అత్యధిక వికెట్ తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇక జూన్ 2021లో  ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంకకు నెట్ బౌలర్‌గా వెళ్లిన అర్షదీప్.. ఇండియన్ టీంలో కోవిడ్ కేసు నమోదు కావడంతో చివరి రెండు టీట్వంటీలకు మెయిన్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 32 మ్యాచులు ఆడాడు. 33 వికెట్లు తీశాడు. ఐదు వికెట్లు కూడా ఒక్కసారి సాధించాడు. ఓవరాల్ ఎకానమి 8.52గా ఉంది. మొత్తంగా అర్షదీప్ మున్ముందు ఎలాంటి ప్రతిభ కనబరుస్తాడో చూడాలి.

Also read : IPL 2022: దాదాపు 9 ఏళ్ల తర్వాత సచిన్ నెట్స్ లో ప్రాక్టీస్..!!

Also read : No Ball Issue: మరోసారి నో బాల్ హైడ్రామా సృష్టించిన రిషభ్ పంత్, జరిమానా తప్పదా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News