సెంచరీతో కెరీర్‌కి గుడ్‌బై చెప్పిన క్రికెటర్‌కి 'సాహోరే' అన్న సోషల్ మీడియా

కెరీర్‌కి సెంచరీతో గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్ క్రికెటర్‌కి సోషల్ మీడియా బ్రహ్మరథం

Last Updated : Sep 10, 2018, 09:27 PM IST
సెంచరీతో కెరీర్‌కి గుడ్‌బై చెప్పిన క్రికెటర్‌కి 'సాహోరే' అన్న సోషల్ మీడియా

ఇండియాతో ఆడుతున్న 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా 114/2 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాట్స్ మేన్ తమ సత్తా చాటుకుంటున్నారు. చివరి టెస్ట్ లో 4వ రోజు ఇంగ్లండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్ రెచ్చిపోయాడు. ఇటీవలే ఈ సిరీస్‌తో ఇక తాను రిటైర్‌మెంట్ తీసుకోనున్నట్టు ప్రకటించిన కుక్ కెరీర్‌లో ఆడుతున్న తన చివరి టెస్ట్ మ్యాచ్‌లో రెచ్చిపోయి సెంచరీ పూర్తి చేసి 116 పరుగులు(4X10) రాబట్టాడు. కుక్‌కి ఇది టెస్ట్ కెరీర్‌లో 33వ సెంచరీ కావడం విశేషం. చివరి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన కుక్‌కి ప్రపంచ క్రికెట్ ప్రియులు ఘనంగా వీడ్కోలు పలుకుతూ గుడ్‌బై చెప్పారు. ఇదిలావుంటే మరోవైపు ఇంగ్లండ్ స్కిప్పర్ జో రూట్ సైతం భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ సెంచరీ పూర్తిచేశాడు. జో రూట్ టెస్ట్ కెరీర్‌‌లో ఇది 14వ సెంచరీ కాగా ఇండియాపై 4వ సెంచరీ. అందులోనూ ఇదే ఓవల్ గడ్డపై రూట్ భారత్‌పై సెంచరీ చేయడం ఇది రెండోసారి. 

 

 

ఒకవిధంగా చివరి టెస్ట్ రెండో రోజు భారత బౌలర్లకు ఏ విధంగానూ కలిసి రావడం లేదు. అలిస్టర్ కుక్-జో రూట్ కలిసి జాగ్రత్తగా ఆడుతూ భారత్‌పై ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

 

 

Trending News