Ind Vs Pak: టీ20 ప్రపంచకప్ 2021లో పాక్(Pakistan) చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తానీయుల అనందానికి అవధుల్లేవు. ఈ విజయంపై పాక్ మంత్రులు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే పాక్ గెలుపుపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Pakistan PM Imran khan) సోమవారం స్పందించారు. భారత్‌తో క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లాలని తమ దేశం కోరుకుంటోందని అన్నారు.
సౌదీ అరేబియా(Saudi Arabia)లోని రియాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఖాన్ పాల్గొన్నారు. టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2021)లో తమ తొలి మ్యాచ్‌లో భారత్(Teamindia)పై తమ దేశం సాధించిన విజయం 'చారిత్రకమైనది' అని పేర్కొన్నారు. “భారత్, పాకిస్తాన్ మంచి పొరుగు దేశాలుగా ముందుకు సాగవచ్చు” అని ఖాన్ చెప్పినట్లు పాక్ మీడియా పేర్కొంది. ఇస్లామాబాద్ ఢిల్లీ(Delhi)తో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటోందని ఖాన్ తెలిపారు. అయితే ఈ సంభాషణకు ఈ సమయం సరికాదని కూడా అన్నారు.
Also Read; Babar Azam about Ind vs Pak match result: ఇండియాపై పాక్ విజయంపై బాబర్ ఆజం ఏమన్నాడంటే..
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 151 పరుగులు చేసింది. 152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. ఎక్కడ తడబడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పాక్ జయ కేతనాన్ని ఎగరవేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి