Sachin Tendulkar Hospitalised: కరోనా పాజిటివ్, ఆసుపత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్

Sachin Tendulkar Hospitalised: ఇటీవల క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ సహా పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు కోవిడ్-19 మహమ్మారి బారిన పడ్డారని తెలసిందే. శుక్రవారం నాడు తన ఆరోగ్యంపై మరో అప్‌డేట్ ఇచ్చాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 2, 2021, 12:11 PM IST
  • గత వారం కరోనా వైరస్ బారిన సచిన్ టెండూల్కర్
  • తాజాగా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన భారత క్రికెట్ దిగ్గజం
  • వన్డే వరల్డ్ కప్ విజయానికి 10 ఏళ్లు సందర్భంగా సచిన్ విషెస్
Sachin Tendulkar Hospitalised: కరోనా పాజిటివ్, ఆసుపత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్

Sachin Tendulkar Hospitalised: కరోనా వైరస్ మహమ్మారి భారత మాజీ క్రికెటర్లను భయాందోళనకు గురి చేస్తోంది. ఇటీవల క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ సహా పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు కోవిడ్-19 మహమ్మారి బారిన పడ్డారని తెలసిందే. శుక్రవారం నాడు తన ఆరోగ్యంపై మరో అప్‌డేట్ ఇచ్చాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న పలువురు క్రికెటర్లకు కరోనా సోకింది.

టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చికిత్స తీసుకునేందుకు ఆసుపత్రిలో చేరాడు. కోవిడ్-19కు చికిత్సలో భాగంగా ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు తన అభిమానులు, శ్రేయోభిలాషులకు తెలుపుతూ ఓ ట్వీట్ చేశాడు. వైద్యుల సలహా మేరకు తాను ఆసుపత్రిలో చేరానని, త్వరలోనే కరోనాను జయించి ఇంటికి చేరుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. తనకోసం ప్రార్థించిన వారికి, తాను కోలుకోవాలని కోరుకుంటున్న వారికి ట్వీట్ ద్వారా సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ధన్యవాదాలు తెలిపాడు.

Also Read: Sachin Tests Positive For COVID-19: సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్, ట్వీట్ ద్వారా స్పష్టం చేసిన క్రికెట్ దిగ్గజం

2011లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా వన్డే ప్రపంచ కప్‌ను సాధించడం తెలిసిందే. నేటితో 10 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో భారతీయులందరికీ, తన సహచర క్రికెటర్లకు వరల్డ్ కప్ విజయానికి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు తెలిపాడు. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ లాంటి దిగ్గజాలకు అందనిద్రాక్షగా నిలిచిన వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2011)‌ను తన చివరి ప్రయత్నంలో సచిన్ టెండూల్కర్ సాధించాడు.

Also Read: IPL 2021: Sanju Samson యంగ్ కెప్టెన్ కాదు, ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ ఆసక్తికర వ్యాఖ్యలు

వన్డే క్రికెట్‌ కెరీర్‌లో 112 మ్యాచ్‌లు లేదా 354 రోజులు అగ్రస్థానంలో కొనసాగాడు. వన్డే క్రికెట్‌లో నవంబర్ 1998లో సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 887 పాయింట్లు సాధించాడు. 1996 మార్చి నెలలో వన్డేల్లో రెండవ స్థానంలో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్‌గా అవతరించాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్ సచిన్. 2010లో దక్షిణాఫ్రికా జట్టుపై ఈ అరుదైన ఘనతను సచిన్ తన ఖాతాలో వేసుకున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News