Asghar Afghan T20I Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలుకొట్టిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అస్ఘర్ అఫ్గాన్

Asghar Afghan Breaks MS Dhonis T20I Record | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ పేరిట ఉన్న అరుదైన రికార్డును ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అస్ఘర్ అఫ్గాన్ బద్దలుకొట్టాడు. టీ20 ఫార్మాట్లో సరికొత్త చరిత్రను తన పేరిట లిఖించుకున్నాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 21, 2021, 02:12 PM IST
Asghar Afghan T20I Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలుకొట్టిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అస్ఘర్ అఫ్గాన్

Ms Dhoni T20 Record | ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అస్ఘర్ అఫ్గాన్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ పేరిట ఉన్న అరుదైన రికార్డును బద్దలుకొట్టాడు. టీ20 ఫార్మాట్లో సరికొత్త చరిత్రను తన పేరిట లిఖించుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది.

టీ20 ఫార్మాట్‌లో జాతీయ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అస్ఘర్ అఫ్గాన్ నిలిచాడు. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 41 టీ20 మ్యాచ్‌లలో విజయం సాధించింది. తాజాగా ఈ రికార్డును అఫ్గాన్ కెప్టెన్ అధిగమించాడు. జింబాబ్వే జట్టుపై 3వ టీ20లో గెలుపుతో అస్ఘర్ అఫ్గాన్ కెప్టెన్సీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయాల సంఖ్య 42కు చేరింది. తద్వారా ధోనీ అత్యధిక టీ20 కెప్టెన్సీ విజయాలను అధిగమించడంతో పాటు ఈ ఫార్మాట్‌లో విజయవంతమైన సారధిగా రికార్డు నెలకొల్పాడు.

Also Read: Ind vs Eng 5th T20 Highlights: లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా.. టీమిండియాదే టీ20 సిరీస్

టీ20లలో బెస్ట్ కెప్టెన్..
అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అస్ఘర్ అఫ్గాన్ నిలిచాడు. 42 మ్యాచ్‌ విజయాలతో అగ్రస్థానంలో నిలిచాడు. 41 టీ20 మ్యాచ్ విజయాలతో ఎంఎస్ ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 33 విజయాలు, పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 29 విజయాలు, వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సామీ 27 విజయాలతో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు.

Also Read: EPFO: తెరపైకి కొత్త వేతన కోడ్, EPFతో పాటు జీతాల్లో ఏప్రిల్ 1 నుంచి మార్పులు

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ 100 వికెట్ల క్లబ్‌కు చేరువలో ఉన్నాడు. లసిత్ మలింగ 107 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. షాహిద్ అఫ్రిది 98 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే వీరిద్దరూ రిటైర్మెంట్ క్రికెటర్లు కనుక రషీద్ ఖాన్ త్వరలోనే ఈ రికార్డులను తిరగరాయనున్నాడు.

Also Read: Teenmaar Mallanna Fan Suicide: తీన్మార్ మల్లన్న ఓటమిని జీర్ణించుకోలేక యువకుడు సూసైడ్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News