Virat Kohli: విరాట్ కోహ్లీ కోసం వేచి చూస్తున్న అరుదైన ప్రపంచ రికార్డు

Virat Kohli: టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లీ కోసం మరో రికార్డు వేచి చూస్తోంది. కెరీర్ పరంగా ఎన్నో రికార్డులు సాధించిన కోహ్లీ..మరో ఘనత సాధించేందుకు కొద్దిదూరంలో ఉన్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 14, 2022, 02:24 PM IST
 Virat Kohli: విరాట్ కోహ్లీ కోసం వేచి చూస్తున్న అరుదైన ప్రపంచ రికార్డు

Virat Kohli: టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లీ కోసం మరో రికార్డు వేచి చూస్తోంది. కెరీర్ పరంగా ఎన్నో రికార్డులు సాధించిన కోహ్లీ..మరో ఘనత సాధించేందుకు కొద్దిదూరంలో ఉన్నారు.

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సాధించేందుకు సమాయత్తంగా ఉన్నాడు. కేవలం కొన్ని పరుగుల దూరంలో వరల్డ్ రికార్డు అతని కోసం వేచి చూస్తోంది. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ ఇండియా..టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 16వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టీమ్ ఇండియా-వెస్ట్ ఇండీస్‌ల మధ్య జరగనున్న తొలి మ్యాచ్ వేదికగా ప్రపంచ రికార్డు విరాట్ కోహ్లి కోసం ఎదురు చూస్తోంది. టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ మరో 75 పరుగులు సాధిస్తే చాలు..అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గుప్టిన్ 3 వేల 299 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక 3 వేల 227 పరుగులతో విరాట్ కోహ్లి (Virat Kohli) రెండవ స్థానంలో నిలిచాడు. మూడవ స్తానంలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 3 వేల 197 పరుగులతో ఉన్నాడు. ఇక ఇదే సిరీస్‌లో టీమ్ ఇండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కోసం కూడా ఓ రికార్డు ఎదురుచూస్తోంది. కేవలం ఒక్క వికెట్ తీసుకుంటే..అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇండియా తరపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ అవుతాడు. ఈ విభాగంలో జస్ప్రీత్ బూమ్రా 66 వికెట్లతో తొలిస్థానంలో ఉంటే..యజువేంద్ర చాహల్ 65 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. 

Also read: Cricket Marriages: క్రికెట్‌లో పెద్దోళ్లైనా...భార్యల కంటే వయస్సులో చిన్నోళ్లే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News