ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్రిస్బేన్ ఆటగాడు మైఖేల్ నెసెర్ పట్టిన క్యాచ్‌పై ఇప్పుడు ప్రపంచమంతా చర్చ సాగుతోంది. ఆ క్యాచ్ ఎలా పట్టాడు, ఆ క్యాచ్‌పై ఎందుకింత రాద్ధాంతం జరుగుతోందనేది తెలుసుకుందాం..
బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్ ప్లేయర్ ఆడిన భారీ షాట్‌ను బ్రిస్బేన్ హీట్ ఫీల్డర్ మైకేల్ నెసెర్ అనూహ్యరీతిలో అందుకున్నాడు. బౌండరీ లైన్‌కు లోపలే గాలిలో ఎగిరి క్యాచ్ పట్టుకున్నాడు. కానీ అదుపు తప్పి లైన్ దాటేస్తుండగా గాలిలో బంతిని పైకి విసిరాడు. ఆ బంతి బౌండరీ లైన్‌కు అవతల లేచింది. దాంతో ఆ బంతి కింద పడేలోగా మళ్లీ ఎగిరి గాలిలో ఆ బంతిని పట్టుకుని బౌండర్ లైన్‌కు అవతల విసిరి..అటు వెళ్లి పట్టుకున్నాడు.
మైఖైల్ నెసెర్ పట్టిన క్యాచ్ కాస్త గందరగోళంగా ఉండటంతో థర్డ్ అంపైర్ చాలాసార్లు రీప్లే పరిశీలించాడు. బంతి ఎక్కడా బౌండరీ లైన్‌కు అవతల పట్టుకున్నట్టుగా లేదు. బంతిని పట్టుకున్నప్పుడు గాల్లోనే ఉన్నాడు. దాంతో ఎంపైర్ అవుట్‌గా డిక్లేర్ చేశాడు.
Outrageous catch from Michael Neser 😱
Allow Glenn Maxwell to explain why it's a legit catch #BBL12 pic.twitter.com/7YORTIUFat
— 7Cricket (@7Cricket) January 1, 2023
అయితే బంతిని ఎంత గాల్లో అందుకున్నప్పటికీ బౌండరీ లైన్‌కు అవతల ఇలా విన్యాసాలు చేస్తే అవుట్ ఎలా అవుతుందనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. అసలీ క్యాచ్‌ల విషయంలో నిబంధనలు మార్చాలనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
Also read: Prithvi Shaw Girl Friend: గాళ్‌ఫ్రెండ్‌తో న్యూ ఇయర్ నైట్ సెలబ్రేట్ చేసుకున్న పృథ్వీ షా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook