Grah Gochar 2023 October: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..అక్టోబర్ నెలలో అనేక గ్రహాలు, నక్షత్రాలు రాశి సంచారం చేయబోతున్నాయి. కాబట్టి అక్టోబర్ మొదటి వారం నుంచే కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ నెలలో మొత్తం మూడు గ్రహాలు వాటి స్థానాల్లో మార్పులు చేసుకోబోతున్నాయి. అక్టోబర్ 1న బుధుడు కన్యారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అక్టోబర్ 2న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు.అక్టోబర్ 3న కుజుడు తులారాశిలోకి సంచారం చేనున్నాయి. అయితే ఈ మూడు సంచారలతో కొన్ని రాశులవారికి ఊహించని లాభాలతో పాటు నష్టాలు జరిగే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
వృషభ రాశి:
ఈ నెలలో వృషభ రాశికి వ్యక్తిగత జీవితంలో చాలా రకాల మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఈ సమయంలో వీరు శుభవార్తలు వింటారు. భవిష్యత్‌లో విజయాల కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఖర్చులు తగ్గడం వల్ల ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి. దీంతో పాటు జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సంపాదనలో చాలా వరకు ఖర్చు అయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఉద్యోగ జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఇక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
మిథున రాశి:
సింహరాశిలో శుక్రుడు సంచారం చేయడం వల్ల మిథున రాశివారికి చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా అనేక ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఆర్థిక లేదా వృత్తి సంబంధిత విషయాలకు సంబంధించిన ప్రయాణాలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఉద్యోగ జీవితంలో మార్పుల కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కూడా పొందుతారు.
మకర రాశి:
ఈ సమయంలో వృత్తిపరమైన జీవితంలో అనేక లాభాలు పొందుతారు. అంతేకాకుండా వ్యక్తిగత జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కూడా ఈ నెలలో ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఈ నెలలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రేమ జీవితం చాలా బాగుటుంది.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Zodiac Signs: అక్టోబర్ నెల మొత్తం ఊహించని లాభాలు పొందబోయే 4 రాశులవారు వీరే..