Why Friday For Laxmi Devi: శుక్రవారమే లక్ష్మీదేవికి ఎందుకు ప్రత్యేకమో మీకు తెలుసా ?

Laxmi Devi Puja On Friday: లక్ష్మీదేవికి శుక్రవారం అంటేనే ఎందుకంత ఇష్టమో మీకు తెలుసా అంటే ఎవరి వద్ద అయినా సమాధానం ఉందా ? ప్రతీరోజూ లక్ష్మీ దేవిని పూజించినప్పటికీ.. శుక్రవారమే ఆ అమ్మ ప్రత్యేక పూజలు అందుకోవడానికి కారణం ఏంటి అనేదే ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2023, 05:19 AM IST
Why Friday For Laxmi Devi: శుక్రవారమే లక్ష్మీదేవికి ఎందుకు ప్రత్యేకమో మీకు తెలుసా ?

Laxmi Devi Puja On Friday: లక్ష్మీదేవికి శుక్రవారం అంటేనే ఎందుకంత ఇష్టమో మీకు తెలుసా అంటే ఎవరి వద్ద అయినా సమాధానం ఉందా ? ప్రతీరోజూ లక్ష్మీ దేవిని పూజించినప్పటికీ.. శుక్రవారమే ఆ అమ్మ ప్రత్యేక పూజలు అందుకోవడానికి కారణం ఏంటి అనేదే ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల్లో లక్ష్మీదేవికి, శుక్రవారానికి ఉన్న సంబంధం ఏంటి ? పురాణాలు ఏం చెబుతున్నాయి అనేది పరిశీలిస్తే.. రాక్షస సంహారి అయిన లక్ష్మీ దేవి రాక్షసుల చేత కూడా పూజలు అందుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. మరి రాక్షసులు ఆ అమ్మవారిని కొలవడానికి కారణం ఏంటనే ధర్మ సందేహాలు చాలా మంది భక్తులకు కలుగుతుంటాయి. ఆ ధర్మ సందేహాలకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ కథనం.

పురాణాల ప్రకారం రాక్షసులు అందరికీ ఒక గురువు ఉండేవాడట. ఆ గురువు పేరే శుక్రాచార్యుడు. ఆ రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి పేరు మీదుగానే శుక్రవారం అనే పేరు వచ్చిందని పురాణాలు తెలిసిన పండితులు చెబుతుంటారు. శుక్రవారానికి ఆ పేరు ఎలా వచ్చిందనే సంగతిని ఇక పక్కకుపెడితే... శుక్రాచార్యుడి తండ్రి పేరు భృగు మహర్షి. ఈ భృగుమహర్షిని బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరిగా చెబుతుంటారు. 

అలా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు అవుతాడని... అందుకే ఆ అమ్మవారికి శుక్రవారం అంటే ప్రీతీకరమైనదని పురాణాలు చెబుతున్నాయి. అలాగే తమ గురువుకు సోదరి అయిన లక్ష్మీ దేవి పట్ల రాక్షసులకు కూడా అమితమైన భక్తి ఉండేదని చెబుతుంటారు.

లక్ష్మీ దేవికి ఇష్టమైన శుక్రవారం నాడు ఆ అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిస్తే.. అమ్మవారు భక్తుల భక్తికి మెచ్చి వారు కోరిన వరాలు ఇస్తుందనేది బలమైన విశ్వాసం. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుని ఆమె అనుగ్రహం పొందిన వాళ్లు ఆమెను శుక్రవారమే పూజించినట్టు పురాణ గాథలు చెబుతున్నాయి. అందుకే లక్ష్మీ దేవికి అత్యంత ఇష్టమైన వరలక్ష్మీ వ్రతం కూడా శుక్రవారమే నిర్వహిస్తారు.

Trending News