importance of kanuma festival: మూడు రోజులపాటు జరుపుకునే సంక్రాంతి పండుగ మూడో రోజును కనుమ పండుగ జరుపుకుంటారు. దీన్ని పశువుల పండుగ లేదా రైతుల పండుగ అంటారు. పంట చేతికి అందడంలో తమకు సహాయపడిన ఆవులను, ఎద్దులను బర్రెలను కనుమ రోజు పూజిస్తారు. పశుపక్షాదులకి గౌరవానికి సూచికగా ఈ ఫెస్టివల్ ను జరుపుకుంటారు. ఈ కనుమను తెలుగు లోగిళ్లలో చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈరోజున కోడి పందాలు, పొట్టేలు పోటీలు, ఎడ్ల పందాలు మెుదలవుతాయి. ముఖ్యంగా ఈ రోజున తమిళనాడులో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు.
కనుమ రోజున పశువులతో ఎటువంటి పని చేయించరు. ఉదయమే పశువులను శుభ్రంగా కడిగి బొట్టు పెట్టి.. మెడలో గల్లుగల్లుమనే మువ్వల పట్టీలు కడతారు. ఈరోజున పశువులకు కొత్త ధాన్యంతో వండిన పొంగలిని పెడతారు. ఈరోజున పశువులను తమ కుటుంబంలోని సభ్యులుగా భావిస్తారు. ఈ కనుమ పండుగ రోజున రైతులు పశువులకు కృతజ్ఞతలు తెలపడం అనవాయితీ. అంతేకాకుండా ఈ రోజున తెలుగు ప్రజలు మాంసం, మినుముతో చేసిన గార్రెలు మెుదలైన పిండి వంటలు చేసుకుని తింటారు. 2023లో కనుమ పండగను జనవరి 16న జరుపుకోనున్నారు.
కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మీకు మంచి జరుగుతుందట. కనుమ రోజు ప్రయాణం చేయడం నిషిద్ధమని చెబుతారు. ఈరోజున ఇల్లంతా బంధువులతో కలకళ్లాడుతుంది. అందరూ కలిసి భోజనం చేయడం, గాలిపటాలు ఎగరవేయడం, సరదాగా గడపడం చేస్తారు.
Also Read: Bhogi Festival: 2023లో భోగి పండుగ ఎప్పుడు వచ్చింది? ఈ ఫెస్టివల్ ప్రాముఖ్యత ఏంటి?
Also read: Sankranti Festival: 2023లో సంక్రాంతి ఎప్పుడు వచ్చింది? ఈ పండుగ విశిష్టత ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.