Name Astrology: పేరులో మొదటి అక్షరం S తో మొదలయ్యే వ్యక్తులు పుట్టుకతోనే నాయకులు. వారి జీవితంలో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. S అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు విశ్వాసంగా కూడా ఉంటారు.
S అక్షరం వ్యక్తుల వ్యక్తిత్వం ఏమిటి?
మీ పేరులోని మొదటి అక్షరం మీరు ఎలాంటివారో చెబుతుంది. న్యూమరాలజీలో ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్ట అర్థం ఉంటుంది. S అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు మీ బంధువులు లేదా మిత్రులు ఉంటే ఆ వ్యక్తుల భవిష్యత్తు ఏంటో? వారి స్వభావం ఎలాంటిదో తెలుసుకుందాం.
1. న్యూమరాలజీలో S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు నాయకులు.చూడటానికి కూడా వీళ్లు నేచురల్ గా రొమాంటిగ్గా కనిపిస్తారు. ఈ వ్యక్తులు అడుగుపెట్టిన ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. ఈ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు అత్యంత విశ్వసనీయులు.
Also read: Chanakya Niti in Telugu: కుక్కలో ఉండే ఈ ౩ లక్షణాలు పురుషుల్లో ఉంటే స్త్రీలు వారిని అస్సలు వదలరట..!
2. s అక్షరం వ్యక్తులను చర్యల ద్వారా ప్రేమను పంచండి. సుఖదుఃఖాలలో తమ ప్రియమైన వారి పక్షాన వారు అండగా ఉంటారు. తమ భావాలను అందరితో పంచుకోరు. ఈ అలవాటు వల్ల వీళ్లు ఒక్కోసారి డిప్రెషన్ కు గురవుతుంటారు.
3. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ తమ కోసం ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. వాటిని సాధించడానికి కష్టపడి పనిచేస్తారు. కష్టతరమైన పోరాటం ద్వారనే వారు విజయం సాధిస్తారు. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ. s లెట్టర్ పేరు ఉన్నవారు సాధారణంగా ఎవరినీ మోసం చేయరు. వారికి జీవితంలో డబ్బు ప్రాముఖ్యత తెలుసు. తద్వారా విజయవంతమైన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అవుతారు. వారు పేరు ,డబ్బు రెండింటినీ సంపాదిస్తారు.
4. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వక్తులు ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వెంటనే వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే వీళ్ల వారు నిజాయితీకి మారు పేరు. అందుకే ఎప్పుడూ తమ మిత్రులను విడిచిపెట్టరు. S లెట్టర్ తో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. కోపం వస్తే చాలా ఎమోషనల్ అయిపోయి తమ నిగ్రహాన్ని కోల్పోతారు. ఇదే వారిలో ఉండే వీక్ పాయింట్. అందుకే వారిని అర్థం చేసుకోవడం ఇతరులకు కష్టంగా మారుతుంది.
Also read:Guru Pushya Yoga 2024: ఈరోజు పుష్యపౌర్ణమి, గురుపుష్య యోగం.. ఇలా చేస్తే కటికదరిద్రుడైనా కుభేరయోగం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook