Wednesday Remedies: బుధవారం నాడు ఈ చిన్న పరిహారాలు చేస్తే.. ప్రతి పనిలో విజయం మీదే! ఆర్థిక సమస్యలు దూరం

For success Do these small things on Wednesday. బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది. ఏ పూజలు చేయడం వలన గణేశుడి అనుగ్రహం ఉంటుందో ఓసారి తెలుసుకుందాం.  

Written by - P Sampath Kumar | Last Updated : Dec 14, 2022, 07:32 AM IST
  • బుధవారం నాడు ఈ చిన్నచిన్న పనులు చేస్తే
  • ఆర్థిక సమస్యలు దూరం
  • ప్రతి పనిలో విజయం మీదే
Wednesday Remedies: బుధవారం నాడు ఈ చిన్న పరిహారాలు చేస్తే.. ప్రతి పనిలో విజయం మీదే! ఆర్థిక సమస్యలు దూరం

Wednesday Remedies: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం.. ప్రతి రోజు ఓ దేవుడికి లేదా దేవతకి అంకితం చేయబడింది. బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది. హిందూ మతంలో వినాయకుడిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఏ శుభ కార్యమైనా గణేశుడి పూజతో ప్రారంభిస్తారు. వినాయకుడి పూజతో పని ప్రారంభించడం వలన.. ఆ పని సజావుగా పూర్తవుతావుతుందని అందరూ భావిస్తారు. ఇక బుధవారం రోజున వినాయకుడి అనుగ్రహం పొందేందుకు పలు పూజలు చేస్తారు. ఏ పూజలు చేయడం వలన గణేశుడితో పాటు మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుందో ఓసారి తెలుసుకుందాం.

బెల్లం:
జ్యోతిష్యం ప్రకారం బుధవారం నాడు గణేశుడి ఆలయానికి వెళ్లి బొజ్జ గణపయ్యకు బెల్లం సమర్పించండి. దీంతో గణేశుడితో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయి. మీకు ఎప్పుడూ డబ్బు, ధాన్యం కొరత ఉండదు. అంతేకాకుండా బుధవారం నాడు  గణేశుడికి మోదకం కూడా సమర్పించవచ్చు.

జాపత్రి:
ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే బుధవారం నాడు గణేశుడికి 21 లేదా 42 జాపత్రి సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం పూర్తిగా తొలగిపోతుంది. బుధవారం నాడు నెయ్యి, పంచదార కలిపిన పెసల్లు ఆవుకు తినిపిస్తే త్వరగా ఋణ బాధలు తొలగిపోతాయి.

దూర్వా, లడ్డూలు: 
బుధవారం నాడు గుడికి వెళ్లి గణేశుడికి దూర్వా, లడ్డూలు సమర్పించండి. దాంతో ఆనందం మరియు శ్రేయస్సు ఆశీర్వాదాలు మీపై ఉంటాయి. బుధవారం సూర్యోదయానికి ముందు 2 చెంచాల పెసల్లు తీసుకొని.. మీ కోరికను గణేశుడికి చెప్పి ప్రవహించే నీటిలో వదలండి. దీనివల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

నపుంసకుడికి దానం: 
బుధవారం గణేశుడికి పూజ చేసిన తర్వాత నపుంసకుడికి ఏదైనా దానం చేయడం చాలా ప్రయోజనకరం. విరాళం ఇచ్చిన తర్వాత నపుంసకుడు నుంచి కొంత డబ్బును ఆశీర్వాదంగా తీసుకోండి. ఈ డబ్బును దీపంతో పాటు ఉంచి వారికి చూపించండి. దీని వల్ల మీ సమస్యలన్నీ త్వరలో పరిష్కారమవుతాయి.

అథర్వశీర్ష పారాయణం:
బుధవారం నాడు అథర్వశీర్ష పారాయణం చేయడం వల్ల గణేశుడు త్వరగా సంతోషించి భక్తులపై వరాలు కురిపిస్తాడు. దాంతో భక్తుల ఆటంకాల తొలగిపోతాయి.

గణేశుడి నుదుటిపై కుంకుమ:
బుధవారం రోజున గణేశుడిని పూజించిన తరువాత బొజ్జగణపయ్య నుదుటిపై కుంకుమ పెట్టండి. ఆపై మీ నుదిటిపై రాసుకోండి. దీనితో మీరు అన్ని పనులలో విజయాన్ని పొందుతారు.

Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్లు ఎలా

Also Read: China Army PLA: ఇండియన్ ఆర్మీపైనే నేరం మోపిన చైనా ఆర్మీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News