Vinayaka chavithi 2023: వినాయక చవితి ఎప్పుడు? ఈ పండుగ విశిష్టత ఏమిటి?

When is Vinayaka Chavithi: మరో నాలుగు రోజుల్లో వినాయక చవితి రానుంది. ఈ పండుగను వైభవంగా జరుపుకునేందుకు దేశ మెుత్తం రెడీ అయింది. ఈ పండుగ ఎప్పుడు వచ్చింది, దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2023, 08:34 PM IST
Vinayaka chavithi 2023: వినాయక చవితి ఎప్పుడు? ఈ పండుగ విశిష్టత ఏమిటి?

Vinayaka Chavithi 2023: హిందువులు ఏ పని ప్రారంభించాలన్నా, పూజ చేయాలన్నా ప్రథమంగా వినాయకుడిని పూజిస్తారు. భాద్రపద మాసం వినాయకుని ఆరాధనకు చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలోనే వినాయక చవితిని దేశవ్యాప్తంగా చాలా వైభవంగా జరుపుకుంటారు. శివపార్వతుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 

వినాయక చవితి ఎప్పుడు?

మన దేశంలో గణేష్ ఉత్సవాలను తొలిసారిగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రారంభించారు. ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబరు 18న వచ్చింది. ఇదే రోజు మధ్యాహ్నం చవితి తిథి ఉండడంవల్ల 11 గంటల నుండి రెండు గంటల సమయం విఘ్నేశ్వరుని ప్రతిష్టించి పూజించటం మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ పండుగను జరుపుకునేందుకు దేశ మెుత్తం రెడీ అయింది. ఇప్పటీ నుంచే విగ్రహాలను కొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. వినాయక చవితి నాడు గణపతిని 21 రకాల పత్రాలతో పూజిస్తారు. 

వినాయక జననం
కైలాసంలో పార్వతీదేవి ఒకనాడు స్నానమాచరించడానికి సిద్దమవుతుంది. ఆ సమయంలో నలుగుతో ఒక బాలుడి రూపాన్ని తయారుచేస్తుంది. ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ట చేసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి..ఎవ్వరినీ లోపలికి రానివ్వవద్దని  చెప్తూంది. ఆ సమయంలోనే శివుడు అక్కడకు వస్తాడు. అడ్డుకోబోయిన బాలుడి శిరచ్ఛేదనం చేస్తాడు. మహాదేవుడు చేసిన పనికి పార్వతీదేవి ఎంతో దుఃఖిస్తుంది. దీంతో శివుడు గజాసురుని శిరస్సును తెచ్చి ఆ బాలుడికి అతికించి బతికిస్తాడు. అప్పటి నుండే వినాయకుడు గజాననుడు అయ్యాడు. వినాయకుడి వాహనం ఎలుక. 

Also Read: Guru Gochar 2023: మేషరాశి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. కారణం ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News