Vinayaka Chavithi 2022: రేపే వినాయక చవితి... ఈ 4 రాశులవారికి గోల్డెన్ డేస్..!

Ganesh Chaturthi 2022: వినాయక చవితి రోజు శుక్రుడు తన రాశిని మార్చనున్నాడు. ఈ గణేష్ చతుర్థి నాలుగు రాశులవారిక శుభప్రదంగా ఉండనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 30, 2022, 08:35 AM IST
Vinayaka Chavithi 2022: రేపే వినాయక చవితి... ఈ 4 రాశులవారికి గోల్డెన్ డేస్..!

Surya Singh Yuti on Ganesh Chaturthi 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, రేపు అంటే ఆగస్టు 31న శుక్రుడు తన రాశిని మార్చి సింహరాశిలోకి ప్రవేశించనుంది. శుక్రుడు... సంపద, అందం, ప్రేమ, శృంగారానికి కారకుడు. సూర్యుడు విజయానికి, విశ్వాసానికి, ఆరోగ్యానికి కారకుడు. గణేష్ చతుర్థి (Ganesh Chaturthi 2022) రోజున ఈ రెండు ముఖ్యమైన గ్రహాల కలయిక మెుత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. వినాయక చవితి రోజు ఈ 4 రాశులవారు లక్ష్మీదేవి అనుగ్రహంతో భారీ మెుత్తంలో డబ్బు సంపాదించనున్నారు. 

మేషం (Aries): శుక్రుని సంచారం మేష రాశి వారికి అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. కెరీర్ లో పురోగతి ఉంటుంది. లగ్జరీ లైఫ్ ను పొందుతారు. 

వృషభం (Taurus): ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి శుక్రుడు సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది.  ఆర్థికంగా పురోగతి పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో శుభవార్త వింటారు.  

సింహం (Leo): శుక్రుడు తన రాశిని మార్చుకుని సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రాశిలో శుక్రుడు మరియు సూర్యుడు కలయిక ఈ వ్యక్తులకు చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీకు కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది. జీతం పెరుగుతుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. కెరీర్‌లో పురోగతి ఉంటుంది.

కుంభం (Aquarius): శుక్రుని సంచారం కుంభ రాశి వారికి జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. వారు ప్రేమ, డబ్బు, గౌరవం అన్నీ పొందుతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. జీవితంలో సౌకర్యాలు పెరుగుతాయి. కెరీర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపారుల వ్యాపారం పెరుగుతుంది. మీరు సీనియర్ల నుండి మద్దతు పొందుతారు.

Also Read: Rahu Kethu Dosham: జాతకంలో రాహు కేతు దోషాలుంటే..ఏం చేయాలి, పాటించాల్సిన పద్ధతులు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News