Shukra Gochar: చాలా ఏళ్ల తర్వాత మీనరాశిలో గురు-శుక్ర గ్రహాల కలయిక.. ఈ రాశుల వారిపై కనకవర్షం..

Shukra-Guru Yuti 2023:  ఫిబ్రవరిలో మీనరాశిలో గురు శుక్ర గ్రహాల కలయిక ఏర్పడనుంది. ఇది కొన్ని రాశులవారికి ప్రత్యేకంగా ఉండనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2023, 04:57 PM IST
Shukra Gochar: చాలా ఏళ్ల తర్వాత మీనరాశిలో గురు-శుక్ర గ్రహాల కలయిక.. ఈ రాశుల వారిపై కనకవర్షం..

Shukra-Guru Yuti 2023:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఏదైనా రెండు గ్రహాలు ఒకే రాశిలో కలవడాన్ని సంయోగం లేదా యుతి అంటారు. ఈ కలయిక కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. ఫిబ్రవరి 15న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే గురుడు అదే రాశిలో సంచరిస్తున్నాడు. 12 ఏళ్ల తర్వాత ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీని కారణంగా మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి గురు మరియు శుక్ర గ్రహాల కలయిక చాలా బాగుంటుంది. మీ తొమ్మిదవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడబోతోంది. దీంతో మీ కెరీర్ రాకెట్ లా దూసుకుపోతుంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. ఉద్యోగం లేదా బిజినెస్ నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ కుటుంంబంతో మంచి అనుబంధం ఏర్పడింది. 

కుంభ రాశి (Aqaurius): గురుడు మరియు శుక్రుడి సంయోగం కుంభరాశివారికి అనుకూలంగా ఉంటుంది.మీ  జాతకంలోని రెండవ ఇంట్లో బృహస్పతి మరియు శుక్రుల కలయిక జరగబోతోంది. దీని కారణఁంగా మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. పెళ్లికాని ప్రసాదులకు వివాహం  కుదిరే అవకాశం ఉంది. 

మిధునరాశి (Gemini): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గురు మరియు శుక్ర గ్రహాల యుతి.. కెరీర్ మరియు వ్యాపార పరంగా శుభప్రదంగా ఉంటుంది. నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ ను కుదుర్చుకునే అవకాశం ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. 

Also Read: Sun Transit 2023: మరికొన్ని రోజుల్లో కుంభంలోకి సూర్యభగవానుడు... ఈ రాశులకు జాక్ పాట్ ఖాయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News