Shami Plant Vastu Tips: హిందూ మతంలో కొన్ని మెుక్కలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఇందులో తులసి మెుక్క, రావి చెట్టు ప్రధానమైనవి. ఈ కోవలోకే చెందుతుంది శమీ మెుక్క కూడా. వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంట్లో శమీ చెట్టు ఉండటం చాలా శ్రేయస్కరం. ఇంట్లో శమీ మెుక్కను (Vastu tips for Shami Plant) నాటడం వల్ల ఇంట్లో అపారమైన సంపదతోపాటు ఆనందం వెల్లివిరిస్తుంది. కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
శమీతో శనిదోషాలకు చెక్..
శని దోషం లేదా శని మహాదశతో బాధపడుతున్న వారు ఇంట్లో శమీ మొక్కను నాటండి. దీంతో శనిదేవుడు ప్రసన్నుడై మీ కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. శివుడికి కూడా శమీ చెట్టు అంటే చాలా ఇష్టం. ఇది ఇంట్లో ఉండటం వల్ల మీకు శుభం కలుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు శమీ మెుక్కను పూజించండి.
ఈ విషయాలను గుర్తుంచుకోండి..
>> శనివారం శమీ మొక్కను నాటండి. ఇది మరింత వేగంగా ఫలితాలను ఇస్తుంది.
>> ఇంట్లో శమీ మొక్కను ప్రధాన తలుపు దగ్గర ఉంచండి. వీలైతే, ప్రధాన ద్వారం యొక్క ఎడమ వైపున ఉంచండి. మీరు దానిని పైకప్పుపై ఉంచినట్లయితే, దానిని దక్షిణ దిశలో ఉంచండి. శమీ మొక్కను తూర్పు దిశలో కూడా ఉంచవచ్చు.
>> శమీ మొక్కను నాటడంతో పాటు దానికి కూడా పూజలు చేస్తూ ఉండండి. ఇందుకోసం సాయంత్రం పూట శమీ మొక్క ముందు దీపం పెట్టండి. దీంతో ఇంట్లోకి డబ్బు ప్రవాహం పెరుగుతుంది.
Also Read: Planet Transits 2022: సెప్టెంబరులో 3 గ్రహాల రాశి మార్పు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook