Vastu: ఇంట్లో సాలెగూడు పెడితే శుభమా.. ? అశుభమా.. ? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా.. ?

Vastu: ఇంట్లో సాలెగూడు పెడితే శుభమా.. ? అశుభమా.. ? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే.. ? ఇంటి మూలలో సాలె గూడు పెట్టడం శుభప్రదం కాదు. ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 25, 2024, 12:49 PM IST
Vastu: ఇంట్లో సాలెగూడు పెడితే శుభమా.. ? అశుభమా.. ? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా.. ?

Vastu Shastra: ఇంట్లో సాలె గూడు శుభప్రదంగా పరిగణించబడదు. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. దీని వల్ల ఆర్ధికంగా మరింత నష్టపోయే అవకాశాలున్నాయి. లక్ష్మీ దేవికి కూడా సాలెగూడు ఇంట్లో స్థిరంగా ఉండదు. అందుకే ఇంటిలో సాలెగూడును ఎప్పటి కపుడు తొలిగిస్తూ ఉండాలి. ఇంటి పైకప్పు మూలల్లోని సాలెగూడును ఎక్కువ రోజులు ఉంచరాదు. దీంతో అనుకున్న సమయానికి డబ్బులు రాకపోవచ్చు. అంతేకాదు ఇంట్లో సాలెగూడు వల్ల కుటుంబ జీవితాల్లో కల్లోలాలు ఏర్పడవచ్చు.

అంతేకాదు ఇంట్లో సాలెగూడు వల్ల డబ్బు కొరతను ఎదుర్కొవచ్చు. పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో చిరాకు, ప్రతికూలతలు పెరుగుతాయి. ఇంట్లో సాలెగూడు వల్ల ఏర్పడే ప్రతికూలత గురించి తెలుసుకుందాం..

వాస్తు నియమాల ప్రకారం బెడ్ రూమ్‌లో ఉండే సాలెగూడు వల్ల ఏర్పడే బూజు వల్ల కుటుంబంలో అశాంతి ఏర్పుడుతోంది. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలను ఫేస్ చేస్తారు.

వాస్తు ప్రకారం ఇంటి మూలల్లో సాలె గూడు వల్ల కుటుంబ సభ్యులు ఆర్ధిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. క్రమంగా డబ్బును పోగొట్టుకునే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి: Lok Sabha Polls 2024: రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెర.. కేరళ, కర్ణాటక సహా 89 లోక్ సభ సీట్లకు రేపే పోలింగ్..

పూజ గదిలో  సాలెగూడు వల్ల అనేక అనర్ధాలకు దారి తీస్తోంది. అందుకే దేవుడి గదిని ఎప్పటికపుడు పరిశుభ్రంగా ఉంచుకోవడంపై శ్రద్ధ వహించాలి. లేకపోతే అనుకోని అవాంతరాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అంతేకాదు ఇవి వ్యక్తిగతంగా దురదృష్టాన్ని కలిగిస్తాయి.

వంటగదిలో సాలెగూడు వల్ల అనుకోని అశుభాలు కలిగే అవకాశాలున్నాయి. దీని వల్ల కుటుంబ సభ్యులు ఏదో ఒక అనారోగ్యాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. వంట గదిలో గ్యాస్ మరియు సింక్ కింద మెష్‌ను ఎప్పటి కపుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

అంతేకాదు సాలెగూడు వాస్తు దోషాలను పెంచుతుంది. ఇంట్లో సాలె గూడు వాస్తు దోషాలను కలిగిస్తుంది. కుటుంబ జీవితంలో తరుచుగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి. ఇది పిల్లల ఆరోగ్యంపై దుష్భ్రభావం చూపుతోంది. కుటుంబంలో అశాంతి వాతావరణం నెలకొంటుంది. అందుకే ఎప్పటికపుడు ఇంటి మూలల్లో బూజు ఉండటం వల్ల ఆర్ధికంగా ఎన్నో దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థిగా వెంకటేష్ వియ్యంకుడు రఘురాం రెడ్డి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News