Vastu Tips In Telugu: ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక గదిలో తప్పకుండా అల్మరా లేదా బీరువా ఉంటుంది. వీటిల్లోనే చాలామంది డబ్బులు, బంగారు ఆభరణాలు భద్రపరుచుకుంటూ ఉంటారు. వాస్తు నియమాల ప్రకారం ఈ అల్మారా సరైన గదిలో ఉంటేనే సంపదకు ఎలాంటి లోటు ఉండదు. అయితే చాలామంది బీరువా, అల్మరాలను ఉంచకూడని గదుల్లో ఉంచుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా ఉంచడం వల్ల డబ్బులు నష్టపోవడమే కాకుండా, మానసిక ఆరోగ్యం కూడా దెబ్బ తినే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా కొంతమంది దీర్ఘకాలంగా కూడా నష్టపోవచ్చు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారంతో కలిగి ఉన్న అల్మరాను ఏ గదిలో ఉంచడం శుభప్రదమో.. ఇది ఏ దిక్కులో ఉంటే ధన లాభాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు చిట్కాలు:
వాస్తు శాస్త్రంలో అల్మరాలకు సంబంధించిన దిక్కులను క్లుప్తంగా వివరించారు. అయితే నగలతో కూడిన అల్మరాను వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణం గోడకు ఆనించి ఉంచడం వల్ల ఇంట్లో సంపద, ఆభరణాలు రెట్టింపు అవుతాయి.
ఇంట్లో రోజురోజుకీ ధనం పెరగాలంటే, సమస్యలు పరిష్కారం కావాలంటే, తప్పకుండా బీరువాను లేదా అల్మరాను పడమటి గోడకు ఆనుకుని ఉండేలా చూసుకోవాలి.
చాలామంది ఇళ్లలో ఎంత పని చేసిన డబ్బులు సంపాదించిన పొదుపు నిలవకుండా ఉంటుంది. అయితే ఇలాంటివారు మీరు డబ్బులు పెట్టే అల్మరాను తప్పకుండా వాయువ్యం మూలలో ఉంచడం చాలా మంచిది.
కొంతమంది ఎంత కష్టపడినప్పటికీ డబ్బును పొందలేక పోతారు. అలాగే సులభంగా ఖర్చవుతుంది. దీంతో పాటు అప్పులు కూడా పెరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటివారు మీరు వినియోగిస్తున్న అల్మారాను నైరుతి మూలలో పెట్టాల్సి ఉంటుంది.
మీరు డబ్బులు పెట్టిన అల్మరాకు సంబంధించిన తలుపులను ఎట్టి పరిస్థితుల్లో తెరిచి ఉంచకూడదు. ఇలా ఉంచితే మీ ఇంట్లో ఉండే డబ్బులు పూర్తిగా ఖర్చయ్యే అవకాశాలున్నాయి. దీంతో పాటు ఖర్చులు కూడా పెరగవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
అలాగే ఎప్పుడు అల్మరా తలుపులను దక్షిణం వైపు తెరిచించడం వల్ల అందులో ఉండే నగలు డబ్బులు చోరీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వాస్తు శాస్త్రం తెలిపింది.
డబ్బు లక్ష్మీదేవితో సమానం.. కాబట్టి ఎంతగానో గౌరవించాలి. అయితే ఇందుకోసం అల్మరాను భూమికి ఎప్పుడు ఎత్తులో ఉంచడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఇంట్లో నిలిచి ఉంటుంది.
మీరు వినియోగించే అల్మారా లేదా బీరువా తప్పకుండా వాస్తు శాస్త్రం ప్రకారం ఒకటే రంగులో ఉండాల్సి ఉంటుంది. చాలామంది ఎరుపు ఆకుపచ్చ రంగుతో కూడిన అల్మరాలను వినియోగిస్తున్నారు. ఈ రంగులతో కూడిన వాటిని వినియోగించడం అంత మంచిది కాదు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
డబ్బుతో ఉన్న అలుమరాలు బీరువాలు ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. వీటిలో ఏవైనా ఒక్కని వస్తువులను ఉంచడం చాలా మంచిది.
Vastu Tips In Telugu: స్త్రీలు బంగారం పెట్టిన అల్మరాలు ఈ వైపులో ఉంటే ధనమే, ధనం!