Vastu Tips: ఈ 5 మొక్కలను ఇంటికి తప్పుడు దిశలో నాటితే ఆర్థిక నష్టాలు తప్పవట!

Vastu Tips: చాలా మందికి ఇంట్లో మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం తులసి, అరటి, రోజ్మేరీ, షమి, మనీ ప్లాంట్​లను ఏ దేశలో నాటాలి? ఏ ప్రదేశంలో నాటకూడదు? అనే వివరాలు మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2022, 10:45 AM IST
  • ఇంట్లో మొక్కలు నాటే విషయంలో జాగ్రత్తలు
  • వాస్తు శాస్త్రం ప్రకారం మొక్కలు నాటకూడని ప్రదేశాలు
  • తులసి మొక్క నాటేందుకు సరైన దిశ
Vastu Tips: ఈ 5 మొక్కలను ఇంటికి తప్పుడు దిశలో నాటితే ఆర్థిక నష్టాలు తప్పవట!

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మొక్కలు నాటడం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. కొన్ని రకాల మొక్కలను నాటడం ద్వారా ఇంట్లో సానుకూలతలు, సుఖ సంతోశాలు, ధనం పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతున్నట్లు నిపుణులు అంటున్నారు. అయితే అవన్ని వాస్తు ప్రకారం నాటినప్పుడే జరుగుతాయని చెబుతున్నారు. అదే తప్పుడు దిశలో మొక్కలు నాటడం ద్వారా అవి ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తాయని.. హెచ్చరిస్తున్నారు. అలా సరైన దిశలో నాటకుంటే నష్టాలు కలిగించే 5  మొక్కలు, వాటి వల్ల కలిగే నష్టాలతో పాటు.. ఆయా మొక్కలు నాటేందుకు సరైన ప్రాంతం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి మొక్క..

ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదం. ఈ మొక్క వల్ల ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయని నమ్ముతారు చాలా మంది. వాస్తు శాస్త్రం ప్రకారం, తులసిని ఎప్పుడూ ఇంటికి దక్షిణ దిశలో నాటకూడదు. అలా చేస్తే ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారుతుందట. అందుకే తులసిని ఎప్పుడు తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యంలో నాటాలని నిపుణులు సూచిస్తున్నారు.

షమి మొక్కను ఆ దిశలో నాటొద్దు..

వాస్తు శాస్త్రం ప్రకారం షమీ మొక్కను దక్షిణ దిశలో ఆస్సలు నాటకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలకు దారి తీస్తుంది. ఈ మొక్కను నాటేందుకు ఉత్తమ ప్రదేశం తూర్పు లేదా ఈశాన్యం. దీని ద్వారా ఇంటికి వాస్తు దోశాలు ఉంటే తొలగుతాయి.

రోజ్మేరీ మొక్క..

రోజ్మేరీ మొక్కను కూడా చాలా మంది ఎంతో పవిత్సంగా చూస్తుంటారు. ఈ మొక్క ఇంట్లో శాంతిని, సానుకూలతలు పెంచుతుందని నమ్మిక. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి దక్షిణాన నాటకూడదట. అలా చేస్తే ఇంట్లని వారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చని చెబగుతున్నారు నిపుణులు.

మనీ ప్లాంట్​..

ఈ మొక్కను ఇంట్లోనే కాదుకార్యాలయాల్లో నాటేందుకు కూడా చాలా మంది మొగ్గు చూపుతుంటారు. ఈ మొక్కను అదృష్టానికి చిహ్నంగా భావించడం ఇందుకు కారణం అయితే.. దీనిని ఇంటికి లేదా కార్యాలయానికి సరైన దిశలో నాటినప్పుడు మాత్రమే దాని నుంచి వచ్చే ఫిలితాలు దక్కుతాయిని వాస్తు నిపుణులు అంటున్నారు. ఈ మొక్కను ఆగ్నేయ దిశలో నాటడం ఉత్తమమని అంటున్నారు.

అరటి..

అరటి మొక్కకు వాస్తు శాస్త్రంతో పాటు ఆయుర్వేదంలో కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఈ మొక్కను విష్ణువుకు ప్రీతికరమైనదిగా నమ్మిక. ఈ మొక్కను ఇంటికి దక్షిణ లేదా పడమర దిశన అస్సలు నాటొద్దని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఈశాన్యం ఈ మొక్కకు అత్యంత శ్రేయష్కరమని సూచిస్తున్నారు.

నోట్​: ఈ కథనంలోని సమాచారం కేవలం వాస్తు నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. వీటిని ZEE తెలుగు NEWS ధ్రువీకరించలేదు.

Also read: Hanuman Jayanti 2022: హనుమాన్ జయంతి రోజున ఈ పూజ చేస్తే శని నుంచి విముక్తి తథ్యం!

Also read: Name Astrology: అమ్మాయిలకు ఈ అక్షరాలతో మొదలయ్యే పేరున్న భర్త వస్తే చాలా లక్కీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News