Varahi Ammavaru Temple: వారాహి అమ్మవారి దేవాలయం దేశంలో ఒకే ఒక్క చోట ఉంది. అది కాశీలో ఉంది.అక్కడికి వెళ్ళినప్పుడు ఉగ్ర వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవచ్చు. కాశీ వెళ్ళిన వారు తప్పక దర్శించుకోవలసిన ముఖ్య దేవాలయం ఇది ఒకటి. ఈ ఆలయం వేళలు తెల్లవారుజామున 4:30 కు మాత్రమే దర్శనం ఉంటుంది. కేవలం ముప్పావు గంట మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. తరువాత ఆలయాన్ని మూసేస్తారు.
ఎందుకని తక్కువ సమయం ఉంటుందనే విషయానికొస్తే.. వారాహీ అమ్మవారు వారణాసి గ్రామదేవత. చీకటి పడింది మొదలు ఉదయం 3:30 వరకు గ్రామ సంచారం చేసి వచ్చి అమ్మవారు విశ్రమిస్తుంది. అందువలన అమ్మవారి ఆలయంలో 4 గంటలకు పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన రెండు రంధ్రాలలో నుండి దర్శనం చేసుకోవాలి. ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖ భాగం మాత్రమే కనిపిస్తుంది, రెండవ కన్నంలో నుండి చూస్తే పాదాలు దర్శనమిస్తాయి. అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతి ఇచ్చేసి సెల్లార్ లో నుండి బయటికి వచ్చేస్తారు. ఆ తరువాత ఆ కన్నాలలో నుండి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు.
వారాహీ అమ్మవారి ఆరాధన పద్దతి
తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత. అందుకే ఈమెను రాత్రివేళ్లో మాత్రమే పూజిస్తారు. వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ... చౌరాసి (ఒడిశా), వారణాసి, మైలాపుర్ లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది.
సైన్యాధ్యక్షురాలు
లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు.. భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి అమ్మవారు. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనే నమ్మకం ఉంది. శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ... తరతరాలుగా భక్తుల నమ్మకం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి