Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 14 జూన్ 2021 Rasi Phalalu, ఓ రాశివారి చేతికి ఆస్తి

Today Horoscope In Telugu 14 June 2021: ఏ విషయంలోనూ తొందరపడి హామీలు ఇవ్వకూడదు. లేనిపక్షంలో మీ హామీలు మీకే నష్టాన్ని కలిగించనున్నాయి. విద్యార్థులు చదువుపై ఫోకస్ చేస్తారు. తమ కెరీర్ కోసం ఏ కోర్సు తీసుకోవాలా అని ఆలోచిస్తారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 14, 2021, 08:15 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 14 జూన్ 2021 Rasi Phalalu, ఓ రాశివారి చేతికి ఆస్తి

Horoscope Today 14 June 2021: మేష రాశి
మీరు చెప్పిన విషయాలకు బంధువులు ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చు. కొన్ని విలువైన బహుమతులు అందుకుంటారు. ఖర్చులు అధికం కానున్నాయి. కొన్ని విషయాలు చికాకు తెప్పిస్తాయి. ఓ నిపుణుడి సలహా పాటిస్తే మీకు ప్రయోజనం చేకూరనుంది. వ్యాపారులకు అంతగా కలిసిరాదు. 

వృషభ రాశి
బ్యాంక్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకుని నిరాశ చెందుతారు. మీ ఆర్థిక పరిస్థితి క్షీణించిందని అర్థం చేసుకుంటారు. మరోవైపు మీ మంచితనం కారణంగా సమాజంలో విలువ, గౌరవం పెరుగుతుంది. ఆస్తికి సంబంధించిన పనులతో తీరిక లేకుండా గడుపుతారు. ఇతర పనులను కొంతకాలం పక్కనపెడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు సానుకూల ఫలితాలు వస్తాయి.

Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే 

మిథున రాశి
కొన్ని ముఖ్యమైన విషయాలపై నిర్ణయం తీసుకోవడానికి కొంత విరామం తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అదే సమయంలో ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. ఓ మిత్రుడి విజయాన్ని చూసి అభినందిస్తారు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.

కర్కాటక రాశి 
ప్రయాణించేటప్పుడు మీ ఆస్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీకి సంబంధించి ఒక పండుగ మిమ్మల్ని లాక్ చేయగలుగుతుంది. అద్భుతమైన ఆస్తి బేరసారాలతో కొందరు వ్యక్తులు మిమ్మల్ని రిఫ్రెష్ చేయబోతున్నారు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. ఈ రోజు మీకు అదృష్ట రంగు తెలుపు. తెలుపు దుస్తులు ధరిస్తే ప్రయోజనం కలుగనుంది. 

సింహ రాశి
ఏ విషయంలోనూ తొందరపడి హామీలు ఇవ్వకూడదు. లేనిపక్షంలో మీ హామీలు మీకే నష్టాన్ని కలిగించనున్నాయి. విద్యార్థులు చదువుపై ఫోకస్ చేస్తారు. తమ కెరీర్ కోసం ఏ కోర్సు తీసుకోవాలా అని ఆలోచిస్తారు. చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.

కన్య రాశి
నేడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో చేపట్టిన పనులలో విజయం వరిస్తుంది. ఇతరులను ఏ విషయంలోనూ మరింత కలవరపెట్టకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది. నేడు మీకు అదృష్ట సంఖ్యలు 2 మరియు 11.

Also Read: Lakshmi devi's birth: లక్ష్మీ దేవి పుట్టుకకు కారణం ఏంటి ? లక్ష్మీ దేవి ఎక్కడ, ఎలా, ఎప్పుడు పుట్టింది ?

తులా రాశి
ఒంటరిగా ఉన్నవారు తమ గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. ఏ పని చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపై ఏకాగ్రత మొదలవుతుంది. మీకు అసౌకర్యంగా అనిపించే వ్యక్తులు మీకు దగ్గర రాకుండా చూడండి. సమాజంలో గౌరవం, పలుకుబడి పెరుగుతాయి. ఆశించిన ఫలితాలు అందుకుంటారు.

వృశ్చిక రాశి 
కే అనే అక్షరం ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తారు. ఒక సీనియర్ చేసిన పనికి మీరు చప్పట్లు కొట్టే అవకాశం ఉంది. కొన్ని క్లిష్టమైన కారణాల వల్ల ప్రయాణం ఆలోచనను విరమించబడవచ్చు. బంధువులతో ఆచితూచి వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవు.

ధనుస్సు రాశి
మీకు వ్యక్తిగత విషయంలో సహాయం అవసరం కావచ్చు. మీరు విక్రయించాలనుకుంటున్న ఆస్తి కోసం వచ్చే ప్రతిపాదనల గురించి ఇప్పుడే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక విషయంలో తీసుకున్న అప్పు గొప్ప రాబడిని అందిస్తుంది. ప్రయాణాలు చేయడం శ్రేయస్కరం కాదు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి.

మకర రాశి
నేడు కొన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. పనిచేసే చోట అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. అయినప్పటికీ అతిగా ఒత్తిడికి లోనవకూడదు. జీవిత భాగస్వామితో సమస్య ఉంటే చర్చించి పరిష్కారించుకుంటారు. మీకు ఆస్తి చేతికి రానుంది. మీ జీవితం ఒక్కసారిగా మారిపోనుంది.

Also Read: Sai Baba puja vidhi: సాయి బాబాను ఎలా పూజిస్తే ఏమేం ఫలితాలు కలుగుతాయి ?

కుంభ రాశి
మీకు ఇచ్చిన పని చాలా సంతృప్తికరంగా పూర్తి చేసుకుంటారు. ఇంట్లో విషయాలు గొడవలకు దారితీస్తాయి. కానీ చింతించకండి. ప్రతి ఒక్కరికి ఒంటరిగా గడిపేందుకు కొంత సమయం కావాలి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఉద్యోగులకు పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు పెట్టబడులు పెట్టేందుకు తగిన సమయం.

మీన రాశి
మానసిక ఒత్తిళ్లను పక్కనపెట్టి ముందుకు సాగుతారు. కుటుంబసభ్యుల మద్య కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తుతాయి. పండితుల ముందు ఎవరైనా మిమ్మల్ని విరుద్ధంగా ప్రభావితం చేయవచ్చు. కొందరి నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు. పనికి తగిన గుర్తింపు లభించదు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News