Surya Grahan 2024: 50 ఏళ్ల తర్వాత సుదీర్ఘ సూర్యగ్రహణం.. ఇండియాలో కనిపిస్తుందా?

Solar Eclipse 2024: ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం త్వరలో సంభవించబోతుంది. ఇది మనదేశంలో కనిపిస్తుందా? ఎంత సమయం ఉంటుంది? ఎలాంటి ప్రభావం చూపుతుందో తదితర విషయాలు తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2024, 05:45 PM IST
Surya Grahan 2024: 50 ఏళ్ల తర్వాత సుదీర్ఘ సూర్యగ్రహణం.. ఇండియాలో కనిపిస్తుందా?

Surya Grahan 2024 date and time: హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది తొలి సూర్య, చంద్రగ్రహణాలు మరికొన్ని రోజుల్లో సంభవించబోతున్నాయి. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం హోలీ పండుగ రోజున అంటే మార్చి 25న ఏర్పడబోతుంది ఇది ఏర్పడిన 15 రోజుల్లోనే మెుదటి సూర్యగ్రహణం జరగబోతుంది. ఇది గత 50 ఏళ్లలో అతి సుదీర్ఘ సూర్యగ్రహణం. భూమి మరియు సూర్యుని మధ్య చంద్రుడు వెళ్ళినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది సాధారణంగా అమావాస్య రోజున సంభవిస్తోంది.  

50 ఏళ్లలో ఇదే తొలిసారి..
ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, ఈ సంవత్సరం ఏప్రిల్ 08న ఏర్పడబోతున్న తొలి సూర్యగ్రహణం దాదాపు ఏడున్నర నిమిషాలపాటు ఉంటుంది. గత 50 ఏళ్లలో ఇదే సుదీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం. తర్వాత, 2150లో సుదీర్ఘ సూర్యగ్రహణం సంభవించబోతుంది. సూర్యగ్రహణం ఏప్రిల్ 8న మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2:25 గంటల వరకు ఉంటుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మెక్సికో, అమెరికా, కెనడా, మోంటానా, నార్త్ డకోటా, సౌత్ డకోటాలలో కనిపిస్తుంది. కానీ భారతదేశంలో అది కనిపించదు. అందువల్ల దాని సూతక్ కాలం కూడా చెల్లదు. 

ఈ పనులు చేయడం నిషిద్ధం..
సాధారణంగా గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు హిందువులు. ఈ సమయంలో కొన్ని పనులు చేయడం నిషిద్ధంగా భావిస్తారు. ముఖ్యంగా పూజలు, యాగాలు, శుభకార్యాలు వంటివి చేయరు. గ్రహణాలు గర్భిణీ స్త్రీలపై చెడు ప్రభావం చూపుతుంది. ఈ టైంలో గ్రహణాలు చూడటం, బయటకు రావడం, పదునైన వస్తువులు వాడటం వంటివి గర్భిణులు చేయకూడదు. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: RangBhari EKadashi 2024: రేపు రంగభరీ ఏకాదశి.. ఈ పనులుచేస్తే మీ జీవితంలో గొప్ప అదృష్టయోగం..

Also read: Astrology - Shani Dev: త్వరలో శని దేవుడి రాశి మార్పు.. ఈ రాశుల వారికీ లాటరీ తగిలినట్టే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News