Special Yoga: జాతకంలో ఈ యోగాలు ఉంటే.. మీకు దేనికీ లోటు ఉండదు..

Very Rare Yogas: ఆస్ట్రాలజీలో కొన్ని శుభయోగాలను పేర్కొన్నారు. ఇవి జాతకంలో ఉన్నవారు త్వరలోనే ధనవంతులు అవుతారు. వీరికి దేనికీ లోటు ఉండదు. ఆ రాజయోగాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 20, 2023, 08:44 AM IST
Special Yoga: జాతకంలో ఈ యోగాలు ఉంటే.. మీకు దేనికీ లోటు ఉండదు..

Special Yoga in horoscope:  హిందువులు ఎక్కువగా జాతకాన్ని నమ్ముతారు. పుట్టినప్పటి నుండి పెళ్లి వరకు భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి జాతకాన్ని చూస్తారు. ఒక్కొక్కరి జాతకం ఒక్కోలా ఉంటుంది. జాతకంలో గ్రహాలు బలమైన స్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. ఒకవేళ బలహీన స్థితిలో ఉంటే మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుుంది. ఆస్ట్రాలజీలో కొన్ని యోగాలు చాలా వపవిత్రమైనవిగా భావిస్తారు. ఈ యోగాలు మీ కుండలిలో ఉంటే మీ జీవితంలో సంపద, పదవి, కీర్తి ప్రతిష్టలు కొదవ ఉండదు. 

బుధాదిత్య యోగం
శుభకరమైన యోగాలలో బుధాదిత్య యోగం కూడా ఒకటి. జాతకంలో ఈ యోగం ఉన్నవారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరు చాలా డబ్బును సంపాదిస్తారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. 
ధనలక్ష్మి యోగం 
జాతకంలో ధనలక్ష్మి యోగం ఉన్నవారికి డబ్బుకు లోటు ఉండదు. పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. వీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. 
రాహువు
రాహువును దుష్ట గ్రహంగా భావిస్తారు. ఇది ఎల్లప్పుడూ మన జీవితంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని అనుకుంటాం. కానీ ఈ గ్రహం మీ జాతకంలో బలమైన స్థానంలో ఉన్నప్పుడు ఇది శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు లాటరీ ద్వారా చాలా డబ్బును పొందుతారు.

Also Read: Guru Chandra Yuti 2023: మేషరాశిలో అరుదైన రాజయోగం... ఈ 3 రాశులవారిపై కనక వర్షం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News