Shukra Gochar 2023: వృషభ రాశిలో శుక్ర సంచారం.. ఈ 6 రాశుల వారికి 27 రోజుల పాటు రాజయోగం!

These 6 zodiac signs wil success in love due to Shukra Gochar 2023. శుక్ర గ్రహం 6 ఏప్రిల్ 2023న తన సొంత రాశి వృషభ రాశిలో సంచరించబోతోంది. శుక్ర సంచారం ఏ రాశుల మీద ప్రభావం చూపుతుందో చూద్దాం.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 23, 2023, 09:17 PM IST
  • వృషభ రాశిలో శుక్ర సంచారం
  • ఈ 6 రాశుల వారికి 27 రోజుల పాటు రాజయోగం
  • కెరీర్‌లో ఉన్నత స్థాయి
Shukra Gochar 2023: వృషభ రాశిలో శుక్ర సంచారం.. ఈ 6 రాశుల వారికి 27 రోజుల పాటు రాజయోగం!

These 6 zodiac signs wil success in love due to Shukra Gochar 2023: జ్యోతిషశాస్త్రం ప్రకారం... సంపద మరియు అందానికి కారకంగా శుక్రుడు పరిగణించబడ్డాడు. ఓ వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభ స్థితిలో ఉంటే.. శారీరక, మానసిక మరియు ఆర్థిక సుఖాలను పొందుతారు. జ్యోతిషశాస్త్రంలో గ్రహా సంచారం అనేది ఒక సాధారణ విషయం. కానీ శుక్రుని సంచారం చాలా ముఖ్యమైనది. ఈ శుక్రు సంచారం అన్ని రాశి చక్రాలపై మంచి మరియు చెడు ప్రభావం చూపుతుంది. శుక్ర గ్రహం 6 ఏప్రిల్ 2023న తన సొంత రాశి వృషభ రాశిలో సంచరించబోతోంది. మే 2 వరకు శుక్రుడు అక్కడే ఉంటారు. శుక్ర సంచారం ఏ రాశుల మీద ప్రభావం చూపుతుందో చూద్దాం.

మేష రాశి:
మేష రాశి వారికి శుక్ర సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి రావచ్చు. ఈ కాలంలో మీరు ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు. ప్రేమ జీవితంలో కూడా శుక్రుడు మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాడు.

వృషభ రాశి:
శుక్రుని సంచారం వల్ల వృషభ రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే ఈ కాలంలో కొత్త పనులు ప్రారంభించవద్దు. వ్యాపారస్తులకు ఏకపక్ష ఫలితాలు ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు ఉన్నా.. ఆర్థిక రంగంలో విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి:
ఈ సమయంలో కర్కాటక రాశి వారు పొదుపు చేయగలుగుతారు. మీ కృషికి ప్రశంసలు అందుతాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాన్ని పొందవచ్చు.

కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ శుక్ర సంచారము మంచి చేస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. భాగస్వామితో రొమాన్స్‌ని పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతారు.

మకర రాశి:
శుక్ర సంచారం కూడా మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. వ్యాపారులకు కూడా శుక్ర సంచారం అనుకూల ఫలితాలు తెస్తుంది. డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. ఈ సమయంలో డబ్బు సంపాదించగలుగుతారు.

కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఈ శుక్ర సంచారం కూడా అదృష్టాన్ని కలిగిస్తుంది. మీరు ఉద్యోగంలో అనేక అద్భుతమైన అవకాశాలను పొందుతారు. మీ ఉద్యోగంలో అదృష్టం కూడా మీకు పూర్తిగా సహకరిస్తుంది. పొదుపు చేయగలుగుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది.

Aslo Read: Guru Gochar 2023: 12 ఏళ్ల తర్వాత అరుదైన గ్రహ సంచారం.. 12 రాశులపై ప్రభావం! ఈ 2 రాశుల వారికి మాత్రం  

Aslo Read: Black King Cobra Viral Video: ముగ్గురు స్నేక్ క్యాచర్‌లకు ఉచ్చ పోయించిన బ్లాక్ కింగ్ కోబ్రా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News